Udayagiri Fort Mystery: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి కోట అనేది తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక చారిత్రక రహస్య నిలయం. సముద్ర మట్టానికి దాదాపు 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై నిర్మించబడిన కోట… కేవలం దృఢమైన రక్షణ కట్టడమే కాదు, అనేక ప్రశ్నలు మరియు భయాలను కూడా కలిగించే అద్భుత నిర్మాణం. ఈ కోట చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు మారినా, అదొక మౌన సాక్షిగా మిగిలింది. కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, చోలులు, ముస్లింల పరిపాలన ఇలా అనేక రాజవంశాలు ఈ కోటపై పట్టు సాధించేందుకు పోటీ పడ్డాయి.
![]() |
Udayagiri Fort Mystery |
![]() |
Udayagiri Fort, Nellore |
కానీ, ఉదయగిరి కోట గురించి మాట్లాడితే, కేవలం చరిత్ర కాదు… రహస్యాల గురించీ ఎక్కువగా మాట్లాడతారు. కొండపై ఉన్న కొన్ని గుహల్లోకి ప్రవేశించిన వారు తిరిగి బయటకురాలేదని స్థానికులు చెబుతారు. కొంతమంది చరిత్ర కారుల కథనం ప్రకారం, ఈ గుహలు మిలిటరీ సీక్రెట్ టన్నెల్స్ లాగా పని చేశాయని, అవి నేరుగా సమీప గ్రామాలకైనా, లేదా మరెక్కడికైనా వెళ్లే రహస్య మార్గాలని భావిస్తున్నారు. అంతేకాదు, కొండపై ఎక్కడికక్కడ కనిపించే శిలాశాసనాలు, చిత్రాలు, రాతలు ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోతున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీరు వస్తుండటం, ఆ నీటి మూలం ఎక్కడుందో ఎవరూ చెప్పలేకపోవడం కూడా కాస్త అబ్బురంగా మారింది. ఈ కోటపైన ఓ రహస్యమైన "స్వరగుహ" ఉందని కూడా స్థానికులు చెబుతారు. దీని లోపల మాట్లాడిన శబ్దం వంద రెట్లు మెరుగైన మార్పులతో ప్రతిధ్వనిస్తుందని చెబుతారు. ఇలా శబ్దాలు, నీటి ప్రవాహాలు, కనిపించని దారులు ఇవన్నీ కలిపి ఉదయగిరిని ఒక రహస్య క్షేత్రంగా మార్చాయి.
ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం కోసం ఎంతో కీలకమైన మిలిటరీ బేస్‌గా ఉపయోగించిన ఈ కోట... ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారినప్పటికీ, అక్కడి ప్రజలు ఇంకా కొన్ని ప్రదేశాలకు వెళ్లేందుకు భయపడతారు. రాత్రిపూట కొండపై నీలం వెలుగులు కనపడటం, ఆశ్చర్యకర శబ్దాలు వినపడటం వంటి అనుభవాలను పర్యాటకులు, స్థానికులు కొన్నిసార్లు వెల్లడించిన సందర్భాలూ ఉన్నాయి. కొంతమంది అయితే ఈ కోట ప్రాచీన కాలంలో యంత్రాలు, యుద్ధ ఆయుధాలు తయారీ కేంద్రం అయ్యుండవచ్చునని కూడా ఊహిస్తున్నారు.
Also Read: గండికోటలో దాగిన చరిత్ర గురించి మీకు తెలుసా.!?
చోళ సంస్కృతికి ప్రతిబింబంగా రంగనాథ మండపం, పల్లవుల నిర్మాణ శైలికి ప్రతీకగా బాలకృష్ణ మందిరం, విజయనగర రాజుల నిర్మించిన పారువేట మండపం ఉన్నాయి. సూఫీ సన్యాసి చొరవతో నిర్మించిన చిన్న మసీదు, పెద్ద మసీదు, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అద్దాల మహల్ ఇక్కడ దర్శనీయ స్థలాలు. ఇక కోట పటిష్ఠత గురించి చెప్పాలంటే... గజపతుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యం పద్దెనిమిది నెలలు యుద్ధం చేసింది.
![]() |
Temples of Udayagiri, Nellore |
ఇక్కడి అడవులు దట్టమైన చెట్లతో ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సంజీవని వృక్షాలున్నాయని ప్రతీతి. మొలతాడు సామి అనే సన్యాసి సంజీవని వృక్షాలను అన్వేషిస్తూ అడవుల్లో తిరుగుతుండేవాడని, వనమ్మ అనే వైద్యురాలు ఇక్కడి అడవుల్లో దొరికే ఔషధాలతో రోగాలు నయం చేసేదని స్థానికంగా కొన్ని కథనాలు వ్యవహారంలో ఉన్నట్లు పోట్లూరు సుబ్రహ్మణ్యం 'ఉదయగిరి దుర్గం కథలు'లో ఉంది.
ఉదయగిరి కోట మత సామరస్యానికి వేదిక. ఏటా రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు ముస్లింలు కలిసి పండుగ చేసుకుంటారు. ఉదయగిరి కోట నెల్లూరు నగరానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది. నెల్లూరులో బస చేసి ఉదయం కారులో బయలుదేరితే రెండున్నర గంటల్లో కొండను చేరుకోవచ్చు. కొండ మీద ఉన్న దుర్గం పల్లి గ్రామం, వల్లభరాయ ఆలయం వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి కోటను చేరడానికి ఉన్నది మెట్ల మార్గమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నరకు పర్యాటకులను అనుమతిస్తారు.
ఇక శిల్పాల విషయానికి వస్తే, అక్కడి శిల్పాల్లో కనిపించే నాజూకు పనితనం ఆధునిక శిల్పకళకే సవాలుగా నిలుస్తాయి. అందుకే, ఉదయగిరి కోటపై పరిశోధన చేయాలని అనుకునే ప్రతీ చరిత్రకారుడూ, పురావస్తు శాస్త్రజ్ఞుడూ ప్రతి అడుగులోనూ ఏదో కొత్త దానిని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఉదయగిరి కోట కేవలం ఒక చారిత్రక కట్టడమే కాదు, అది ఒక రహస్యం.
Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?
మరిన్ని Interesting Facts కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS