రాష్ట్రపతి గా నరేంద్ర మోడీ! కాబోయే ప్రధాన మంత్రి ఎవరో తెలుసా?



ప్రధానిగా మూడుసార్లు శాసించిన నరేంద్ర మోదీ రిటైర్మెంట్‌పై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ముదురుతున్నాయి.
సెప్టెంబర్ 17తో ఆయన 75 ఏండ్లు వయస్సు చేరుకోనుండటంతో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. "75 ఏళ్లు వచ్చిందంటే శాలువా కప్పుకుని పదవుల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి" అంటూ మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు.ఈ వ్యాఖ్యలతో మోదీ భవితవ్యంపై విపక్షాలు నోరు విప్పుతున్నాయి. ‘‘ఇది మోదీని గౌరవంగా పక్కకు నెట్టే సంకేతం’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మోదీకి రాష్ట్రపతి పదవి దిశగా బీజేపీ వ్యూహం వేస్తోందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

మోడీ తర్వాత ప్రధాని ఎవరు?

మోదీ రాష్ట్రపతి అభ్యర్థిగా వెళ్తే… ప్రధాని పదవికి బీజేపీ లోపలే నూతన నాయకత్వం కోసం చర్చలు మొదలయ్యాయని సమాచారం. 

ఈ రేసులో ప్రముఖులు:

అమిత్ షా – మోదీ శిష్యుడిగా గుర్తింపు పొందిన ఆయన, రాజకీయ వ్యూహకర్తగా ప్రసిద్ధి.

నిర్మలా సీతారామన్ – అంతర్జాతీయ పరిధిలో వాణిజ్య, ఆర్థిక రంగాల్లో అనుభవం ఉన్న మేధావి నేత.

యోగి ఆదిత్యనాథ్ – హిందుత్వ శ్రేణుల్లో మాస్ బేస్ ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.

ఇప్పటికే పార్టీ అధిష్ఠానం వీరి పేర్లను అంతర్గతంగా పరిశీలిస్తోందని సమాచారం.

రాష్ట్రపతిగా మోదీ?

2027లో రాష్ట్రపతి పదవికి మోదీని ముందుంచే యోచన బీజేపీకి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజలపై ఉన్న ఆయన ప్రభావం, ప్రపంచ స్థాయిలో మోదీ కి ఉన్న గుర్తింపు ఈ నిర్ణయానికి బలంగా నిలవవచ్చని వాదిస్తున్నారు. ప్రధాని పదవి నుంచి గౌరవవంగా వెనక్కు తగ్గేందుకు ఇది సరైన మార్గమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా బీజేపీ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికిప్పుడు ఖండిస్తోంది.

మోడీ కి 75 ఏళ్ల నిబంధన వర్తించదు: బీజేపీ కేంద్ర మంత్రులు

మోదీ కి రాష్ట్రపతి పదవి అనేది ఊహాగానమని బీజేపీ వర్గాలు కొట్టిపారిస్తున్నాయి. ‘‘మోదీ 2029 వరకు ప్రధాని హోదాలో కొనసాగతారు. పార్టీలో 75 ఏళ్ల నిబంధన అనేది మార్గదర్శకులకే వర్తిస్తుంది. మోదీకి అది వర్తించదు’’ అని కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నారు. కానీ అద్వానీ, మురళీమనోహర్ జోషి కి వర్తించిన 75 ఏళ్ల నిబంధన మోడీకి ఎందుకు వర్తించదని బీజేపీ లోనే పలువురు పెదవి విరుస్తున్నారు.


మోదీ ని దించేందుకు ఆర్ఎస్ఎస్ వ్యూహమా?

2024 ఎన్నికల తర్వాత బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడాన్ని లాజికల్‌గా ఉపయోగించుకుంటూ, మోదీని గౌరవంగా వెనక్కి పంపాలన్నదే ఆర్ఎస్ఎస్ వ్యూహమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కొత్త నేతలకు ఛాన్స్ ఇవ్వాలన్న సంకేతంగా భగవత్ వ్యాఖ్యలు వెలువడినట్లు చెప్పుకుంటున్నారు.

మార్పు జరుగుతుందా? లేక ఊహగానాలేనా?

భారతదేశ రాజకీయ భవిష్యత్‌కి మోదీ తర్వాత ఎవరు అనే ప్రశ్న ఇప్పటినుంచే దూకుడు పెంచుతోంది. ప్రధాని పదవిలో మార్పు వస్తే… అది కేవలం పార్టీ వ్యూహమే కాక, దేశీయ-అంతర్జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మార్పు జరుగుతుందా? లేక ఇదంతా ప్రచారమేనా? సమాధానం కోసం సెప్టెంబరు వరకు వేచి చూడాల్సిందే!







Post a Comment (0)
Previous Post Next Post