Mount Kailash Mystery: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?

Mount Kailash Mystery: మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్వతారోహకులు భారీ పర్వతాలను అధిరోహించారు. ఎవరెస్ట్, కాంచన జంగ వంటి ఎత్తైన శిఖరాలను అధిగమించిన వారు ఎన్నో రికార్డులు నెలకొల్పారు. కానీ... ఇవాళ్టి వరకూ ఎవరూ ఎక్కలేని ఓ పర్వతం ఉంది.. అదే మౌంట్ కైలాష్. శివుని నివాసంగా చెప్పబడే ఈ శిఖరం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలతో, భౌగోళిక రహస్యాలతో నిండి ఉంది. ఎందుకంటే ఈ పర్వతంపై ఎక్కే ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. ఇదంతా ఎందుకవుతోంది? కైలాష్ పర్వతం వెనక దాగి ఉన్న అద్భుత రహస్యాలేంటి? ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం...

Mount Kailash Mystery

మౌంట్ కైలాష్ అనేది పర్వతం కాదని, ఓ పవిత్రమైన శక్తి అని అనుకుంటారు. దీన్ని హిందువులు శివుడి నివాసంగా పరిగణిస్తారు. అంటే అక్కడ శివుడు ఉంటాడని నమ్మకం ఉంది. కేవలం హిందువులు కాదు.. బౌద్ధులు, జైనులు కూడా దీన్ని పవిత్ర పర్వతంగా చూస్తారు. కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది చైనా, టిబెట్ సరిహద్దు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఇది 6656 మీటర్లు.. అంటే 21,778 అడుగుల ఎత్తైన శిఖరం. అంటే ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది.

ఎవరూ ఎందుకు ఎక్కలేదు?

1. ఆధ్యాత్మిక కారణం: చాలా మంది నమ్మకం ప్రకారం “ఈ పర్వతాన్ని ఎక్కడం పాపం.”దీనిని “ప్రదక్షిణ”చేయవచ్చు కానీ పైకి ఎక్కకూడదు. శివుడు అక్కడ ఉంటాడని నమ్మడం వల్ల, ఈ పర్వతం ఎక్కడం అనేది అపవిత్ర చర్యగా భావిస్తారు.

2. శక్తివంతమైన భౌగోళిక శక్తులు: శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు.. ఈ పర్వతం చుట్టూ అయస్కాంత శక్తులు ఉన్నాయట. అక్కడ గడియారాలు, GPS పనిచేయవు. దిశలు తప్పిపోతాయి. కొంతమంది ఎక్కే ప్రయత్నం చేసినా.. విఫలమయ్యారు.

3. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం: అయితే ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. టిబెట్‌లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం, బౌద్ధ సన్యాసి మిలరేపా మాత్రమే కైలాస పర్వతం పైకి చేరుకున్నాడు. అయితే దీనికి ఎటువంటి రుజువు లేదు.

Also Read: ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

చాలా మంది అధిరోహకులు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు.. కానీ వారు విఫలమయ్యారు. రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిస్ట్యాకో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు.. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి.. దీంతో అతను వెనుదిరగవలసి వచ్చింది. మరో పర్వతారోహకుడు కల్నల్ RC విల్సన్ మాట్లాడుతూ.. తాను శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని.. దీంతో వెనక్కి వచ్చానని తెలిపాడు.

బ్రిటిష్ ఆర్మీ అధికారులు 1920లలో ఎక్కే ప్రయత్నం చేశారు. కానీ కొంతదూరం వెళ్లగానే తలనొప్పి, గుండె భారంగా ఉండటం మొదలైపోయింది. “ఎదురుగా ఒక శక్తి నిలబడి ‘వెనక్కు వెళ్లు’ అని చెప్పినట్టుగా అనిపించింది…” అని వాళ్లు చెప్పారు.

చైనా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రంగా చూడాలి, టూరిజం కాదని అంటారు.

మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూడటానికి రెండు చాలవు. అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటీకి అలాగే ఉన్నాయి. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి.

Mount Kailash

మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరొందింది. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చినవారి చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే ఎన్నో విషయాలను వెల్లడించారు.

అంతేకాదు ఈ పర్వతాన్ని అధిరోహించాలనుకునేవారి వయస్సు పెరుగుతుందని అందుకే అలా వెళ్లినవారు తిరిగిరారు అని అంటుంటారు. ఇలా ఈ పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ రహస్యాలను మాత్రం ఎవ్వరు ఛేధించలేకపోతున్నారు. ఎందుకంటే మానవతీత శక్తుల భగవంతుడి శక్తి అని లయకారకుడైన పరమశివుడి ఆవాసం అని హిందువుల నమ్మకం.

మౌంట్ కైలాష్ అనేది కేవలం ఓ పర్వతం మాత్రమే కాదు. అది ఒక పవిత్ర స్థలం… శివుడి నివాసంగా పరిగణించే శక్తికేంద్రం. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను కూడా ఎంతో మంది అధిగమించినా, మౌంట్ కైలాష్‌ను మాత్రం ఎవరూ ఎక్కలేకపోవడం అనేది ఇప్పటికీ ఓ అజ్ఞాత మిస్టరీగానే మిగిలింది. ఒకవైపు శాస్త్రవేత్తలు ‘అయస్కాంత శక్తుల ప్రభావం’ గురించి చెబుతుంటే… మరోవైపు భక్తులు, యాత్రికులు ‘శివుడి శాంతిని భంగపరిచే ప్రయత్నమే’ అని విశ్వసిస్తున్నారు. చివరికి ఎంత గొప్ప శారీరక శక్తి ఉన్నా… ఈ పర్వతం ముందు మనిషి ఆత్మాన్వేషణతో నిలబడాల్సిందే. ఎందుకంటే… ఈ శిఖరాన్ని చూస్తే భయం కలగకపోవచ్చు… కానీ ఓ భక్తి, ఓ మౌనం, ఓ శాంతి మాత్రం మనలో ఖచ్చితంగా కలుగుతుంది.

Also Read: దేశ భద్రత కోసం తన జీవితం త్యాగం చేసిన భారతీయ గూఢచారి

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS



Post a Comment (0)
Previous Post Next Post