TGSRTC Jobs 2025: రాత పరీక్షలేకుండా డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ!

TGSRTC Jobs 2025: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డ్రైవర్‌ పోస్టులు 1,000, శ్రామిక్‌ పోస్టులు 743 ఉన్నాయి.

TGSRTC Jobs 2025
TGSRTC Jobs 2025

దరఖాస్తుల ప్రారంభం: ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. 2025 అక్టోబర్‌ 8వ తేదీ నుంచి దరఖాస్తు విండో ఓపెన్‌ అవుతుంది. అభ్యర్థులు తమ అర్హతలు పరిశీలించి ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయవచ్చు.

అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐలో సంబంధిత కోర్సులో సర్టిఫికెట్‌ ఉండాలి. డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం తప్పనిసరి.

Also Read: విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు!

వయోపరిమితి: 2025 జూలై 1వ తేదీ నాటికి వయసు ప్రమాణం ఇలా ఉండాలి:

  • డ్రైవర్‌ పోస్టులకు: 22 నుంచి 35 ఏళ్ల మధ్య
  • శ్రామిక్‌ పోస్టులకు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య

అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు, మాజీ సైనికులకు (ESM) 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ (PMT), మెడికల్‌ పరీక్ష, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అంటే, అభ్యర్థుల శారీరక సామర్థ్యం, ఆరోగ్యం, నైపుణ్యాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు

  • డ్రైవర్‌ పోస్టులకు: జనరల్‌ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.300
  • శ్రామిక్‌ పోస్టులకు: జనరల్‌ అభ్యర్థులు రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.200

జీతభత్యాలు: ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు అందజేయబడతాయి:

  • డ్రైవర్‌ పోస్టులకు: నెలకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు
  • శ్రామిక్‌ పోస్టులకు: నెలకు రూ.16,550 నుంచి రూ.45,030 వరకు

చివరి తేదీ: ఆన్‌లైన్‌ దరఖాస్తులను 2025 అక్టోబర్‌ 28 వరకు స్వీకరిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలి.

Also Read: భారతదేశంలో ఒత్తిడి లేని టాప్ 6 కెరీర్ అవకాశాలు!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post