Countries Dependent on India: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికాతో సహా అనేక దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసియా ఖండంలోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భారతదేశానికి పొరుగు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తి నాయకులు మారిపోతున్నారు. కొన్ని చోట్ల యుద్ధాలు కూడా కొనసాగుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్యన జరిగిన ఘర్షణల్లో భారత్ పైచేయి సాధించింది.
![]() |
Countries Dependent on India |
మరోవైపు రాజకీయ పరంగా కూడా భారత్ బలమైన వ్యవస్థతో ముందుకు సాగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో భారత్ ఇతర దేశాలతో పోల్చితే స్థిరమైన ఆర్థిక, రాజకీయ శక్తి కలిగిన దేశమని చెబుతున్నారు. అంతేకాకుండా భారత్ తనకే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. కొన్ని దేశాలు అయితే భారత్ లేకుండా నిలబడలేవని చెప్పవచ్చు. మరి భారత్‌పై పూర్తిగా ఆధారపడే దేశాలు ఏవో చూద్దాం.
Also Read: ‘జెన్ Z’ అంటే ఎవరు.. గ్రూపులు ఎన్ని?
1. నేపాల్: భారత్ ఉత్తర సరిహద్దులో ఉన్న దేశం నేపాల్. ఇటీవల అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడి కొత్త ప్రధానిగా సుశీల కర్కీ బాధ్యతలు స్వీకరించారు. భారత్-నేపాల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయి. నేపాల్‌కు అవసరమయ్యే వస్తువులలో 65% భారత్ నుంచే ఎగుమతి అవుతాయి. ఇందులో ఇంధనం, ఆహార పదార్థాలు, మందులు, వాహనాలు, వస్త్రాలు ప్రధానమైనవి. ప్రతి ఏడాది సుమారు 30 లక్షల మంది నేపాల్ ప్రజలు భారత్‌లోకి వలస వస్తుంటారు. ఇరు దేశాల మధ్య ప్రయాణానికి వీసా అవసరం ఉండదు. 2025లో నేపాల్ అభివృద్ధి కోసం భారత్ ₹10,000 కోట్ల రుణాన్ని కూడా ఇచ్చింది.
2. భూటాన్: భారత్ సరిహద్దులో ఉన్న మరో దేశం భూటాన్. ఈ దేశానికి దాదాపు 70% అవసరాలను భారత్ ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా హైడ్రోపవర్ ప్రాజెక్టుల అభివృద్ధికి భారత్ నుంచి పెద్ద ఎత్తున సహాయం అందుతుంది. రోడ్లు, భవనాల నిర్మాణానికి కూడా భారతదేశం మద్దతు ఇస్తుంది. ఇంధనం, మందులు, వాహనాలు వంటి అవసరాలన్నీ భారత్ నుంచే దిగుమతి అవుతాయి. భారత్ సహాయం లేకుంటే ఇక్కడ ఆహార కొరత తలెత్తే అవకాశముంది. చైనా యుద్ధ సందర్భంలో కూడా భూటాన్ సరసన భారత్ మిలటరీ నిలిచింది.
3. మాల్దీవులు: పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మాల్దీవులు కూడా భారత్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇక్కడికి భారత్ నుంచే ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. ఒక దశలో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నా, మాల్దీవులు మళ్లీ భారత్ సహకారం కోరుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వ్యవసాయం లేకపోవడంతో, ఆహార పదార్థాలన్నీ భారత్ నుంచే దిగుమతి అవుతాయి. 2020లో సైక్లోన్ కారణంగా మాల్దీవుల్లో నష్టాలు సంభవించినప్పుడు భారత్ 400 మిలియన్లతో నిర్మాణ సహాయం అందించింది.
4. శ్రీలంక: భారతదేశానికి దక్షిణాన ఉన్న శ్రీలంక కూడా భారత్ సహాయం పొందుతున్న దేశం. 2020లో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఏ దేశం ముందుకు రాకపోయినా, భారత్ మాత్రం 4 బిలియన్ల డాలర్లతో శ్రీలంకకు పునరుద్ధరణ సహాయం చేసింది.
5. ఖతర్: అరబ్ దేశం అయిన ఖతర్ ధనిక దేశం అయినప్పటికీ, ఆహార సరఫరా విషయంలో భారత్‌పైనే ఆధారపడుతుంది. ఇక్కడ ఫ్యూయల్ ప్రాచుర్యం ఉన్నా, ఫుడ్ ఐటమ్స్ మాత్రం భారత్ నుంచే దిగుమతి చేస్తారు. ప్రతి ఏడాది ఖతర్‌కు కావలసిన ఆహార వస్తువుల్లో 25% భారత్ సరఫరా చేస్తోంది.
Also Read: నేపాల్ అల్లర్ల వెనుక కారణం ఏమిటి?