Reason for Nepal Protests: నేపాల్ అల్లర్ల వెనుక కారణం ఏమిటి?

Reason for Nepal Protests: భారతదేశానికి పొరుగున ఉన్న మరో దేశం మళ్లీ అల్లకల్లోలానికి గురవుతోంది. నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి దూసుకువచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు విస్తృతంగా జరిగాయి. చివరికి తీవ్ర ఒత్తిడిలో నేపాల్ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి సెప్టెంబర్ 9న తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కొన్ని రోజుల క్రితమే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా రగులుతున్న తిరుగుబాటుకు కారణమైంది. ప్రశ్న ఏంటంటే.. ఓలి తప్పులు ఏమిటి?

Reason for Nepal Protests
Reason for Nepal Protests

జనరల్ జెడ్ యువత (19972012 మధ్య జన్మించిన తరం) ఆధ్వర్యంలో నిరసనలు మామూలు స్థాయిలో కాకుండా ఉధృతమయ్యాయి. రాజధాని ఖాట్మండులో అనేక ప్రాంతాల్లో నినాదాలు, దహనకాండలు చోటు చేసుకున్నాయి. విదేశాంగ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరిగాయి. ఆగ్రహం అంతలా పెరిగింది కాబట్టి పలువురు మంత్రుల ఇళ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. తీవ్ర హింసా వాతావరణంలో హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా తన పదవిని వదులుకున్నారు.


నేపాల్ రాజకీయాల్లో కె.పి. శర్మ ఓలి పెద్ద ముద్ర వేసిన నాయకుడు. ఆయన నాలుగోసారి ప్రధానమంత్రి అయ్యారు. కానీ దేశంలో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతుండటాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ప్రజల అసంతృప్తి పెరిగింది. ఓలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, కీలక నిర్ణయాలు తన సహచరులను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఓలిని చైనా అనుకూల నాయకుడిగా పరిగణిస్తారు.

భారత్‌తో సంబంధాల కంటే చైనాతో అనుబంధాలు బలపర్చాలనే వైఖరి ఆయనదని చెబుతారు. అదే తరహాలో చైనా తరహా విధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నేపాల్‌లో నిషేధించాలని ఆయన నిర్ణయం తీసుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది.

Nepal's Diplomatic Relations between India and China
Nepal's Diplomatic Relations between India and China

నేపాల్ ఒక భూపరివేష్టిత (Landlocked) దేశం. భారత్, చైనా ప్రధాన పొరుగు దేశాలు. ఓలి మాత్రం భారత్ వ్యతిరేకి అని పేరు తెచ్చుకున్నారు. ఇటీవల భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆయనను ఢిల్లీకి ఆహ్వానించగా, మొదట అంగీకరించినప్పటికీ ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. లిపులేఖ్ సరిహద్దు అంశాన్ని కూడా భారత్ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టేందుకు ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా చైనాలో టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరయ్యారు. ముందుగా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరగాల్సి ఉండగా, ఆ ప్లాన్ కూడా రద్దయింది. చైనాకు దగ్గర కావాలనే ప్రయత్నంలో భారత్‌తో సంబంధాలు మరింత చేదువైపుకు వెళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: అమెరికాకు బలూచిస్తాన్ వనరుల అప్పగింత? పాకిస్తాన్‌పై విమర్శల వర్షం

సోషల్ మీడియా నిషేధం ఓలి ప్రభుత్వానికి చెడు ఫలితాలు ఇచ్చింది. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి అమెరికన్ కంపెనీల ప్లాట్‌ఫామ్‌లు నిషేధించబడ్డాయి. కానీ చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్, వీబో, లైకీ యాప్‌లు మాత్రం కొనసాగాయి. దీంతో ఆయన నిర్ణయం అమెరికాకు వ్యతిరేకంగా, చైనాకు మద్దతుగా ఉందనే సందేశం అంతర్జాతీయంగా వ్యాపించింది.

Nepal Bans Facebook, Instagram, WhatsApp and 23 Other Social Media Platforms
Nepal Bans Facebook, Instagram, WhatsApp and 23 Other Social Media Platforms

యువతరం ఎక్కువగా ఉపయోగించే ఈ ప్లాట్‌ఫామ్‌లను ఒక్కసారిగా నిషేధించడం వారిలో తీవ్ర ఆగ్రహం రగిల్చింది. గత వారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, జనరల్ జెడ్ యువతతో చర్చించకపోవడం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. ప్రజలు రోడ్లపైకి రావడంతో ఖాట్మండు సహా దేశవ్యాప్తంగా నిరసనలు ముదిరిపోయాయి. ప్రభుత్వం భద్రతా దళాలకు కాల్పుల ఆదేశాలు ఇచ్చింది.

దాంతో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 350 మందికి పైగా గాయపడ్డారు. విద్యార్థులు నేతృత్వం వహించిన నిరసనల్లో సామాన్య ప్రజల అసంతృప్తి స్పష్టమైంది. కర్ఫ్యూ, భారీగా మోహరించిన సైన్యం ఉన్నప్పటికీ నిరసనలు ఆగలేదు. ప్రభుత్వం చివరికి నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ తిరుగుబాటు నిప్పు ఇంకా ఆరలేదు. ఈ మంట ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి..!

Also Read: అమెరికా ఒత్తిడికి భారత్‌ ఇచ్చిన చరిత్రాత్మక సమాధానాలు!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post