AP Government Investment Plans: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను వచ్చే నెలలో ప్రారంభించనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీసీఎస్ కూడా విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
![]() |
AP Government Investment Plans |
ఉక్కు కర్మాగారం, మిత్తల్ స్టీల్ ప్లాంట్
ఉమ్మడి విశాఖలో ప్రైవేటు ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థ అర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాలను కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పెట్టుబడులపై ప్రత్యేక కార్యాచరణ
కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయ్యాయి. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కలెక్టర్లకు పెట్టుబడి ప్రతిపాదనలపై ప్రత్యేక లాగిన్ సౌకర్యం కల్పించబడింది. ప్రతి ప్రాజెక్టు పూర్తి కావడానికి కాలపరిమితి నిర్ణయించారు.
30 కొత్త క్లస్టర్లు - 1.1 లక్షల ఎకరాలు గుర్తింపు
ప్రస్తుతం ఉన్న 20 క్లస్టర్లతో పాటు మరో 30 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి 1.1 లక్షల ఎకరాల భూమిని గుర్తించారు. పారిశ్రామిక కారిడార్ల వద్ద 74,583 ఎకరాలు, తీర ప్రాంతంలో 56,608 ఎకరాలు కేటాయించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి పదవీ విరమణ చేసిన అధికారుల సాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పరిశ్రమల ఏర్పాటు పై సీఎం స్పష్టత
రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్ ప్రాంతాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అనంతపురంలోని లేపాక్షి - కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతాన్ని భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చుతామని చెప్పారు.
పోర్టులు - ఫిషింగ్ హార్బర్లు - విమానాశ్రయాలు
తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్, నౌకల తయారీ కేంద్రం, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో ఆ ప్రాంతం ఎకనామిక్ హబ్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: గుంటూరు జిల్లాలో మిస్టరీ డెత్స్.. తురకపాలెం ప్రజలు వణికిపోతున్నారు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS