Nepal's Nepo Kids vs Nepal Gen Z: ప్రపంచంలో ఏకైక హిందూ దేశం "నేపాల్". రాచరికం నుంచి ప్రజాస్వామ్యంగా మారినా ఇప్పటికీ అక్కడ సుస్థిర ప్రభుత్వం లేకపోవడం విశేషం. కేవలం 3.5 కోట్ల జనాభా ఉన్నా, వారికి స్థిరమైన పాలన అందించడంలో అక్కడి నేతలు విఫలమవుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకుంటూ, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతూ, అక్రమాలకు పాల్పడుతున్నారు.
![]() |
Reasons Behind Nepal Protests |
- నేపాల్ యువతలో నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారింది.
- 15–24 ఏళ్ల వయసులో 20.8% యువత నిరుద్యోగులు.
- వార్షిక సగటు ఆదాయం కేవలం 1,400 డాలర్లు మాత్రమే.
- సుమారు 20% ప్రజలు పేదరిక రేఖకు దిగువన జీవనం.
ఇదే సమయంలో రాజకీయ నేతల కుటుంబాలు విలాస జీవితం గడపడం యువత ఆగ్రహానికి కారణమైంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం, నేపాల్ ఆసియాలో అత్యంత అవినీతి దేశాల్లో ఒకటి. ఈ అసమానతలు యువతను పాలిటికల్ "నెపో కిడ్స్" పై తిరుగుబాటుకు నడిపించాయి.
![]() |
Nepal's Nepo Kids |
- మాజీ మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ
- మాజీ ప్రధాని కోడలు శివానా శ్రేష్ఠ
- ప్రచండ మనవరాలు స్మితా దహాల్
వారి ఖరీదైన దుస్తులు, విదేశీ పర్యాటనలు, లగ్జరీ వస్తువులు ఎక్స్‌పోజ్ అయ్యాయి. #NepoBabiesNepal హ్యాష్‌ట్యాగ్ మిలియన్ల వ్యూస్ సాధించింది. టిక్‌టాక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఎక్స్‌లో ప్రజలు వ్యంగ్య వీడియోలు, సెటైర్లు చేస్తూ విస్తృతంగా వ్యాప్తి చేశారు. కొందరు రాజకీయ వారసులు తమ అకౌంట్లను మూసివేయగా, మరికొందరు ఆన్‌లైన్ యాక్టివిటీ ఆపేశారు.
Also Read: నేపాల్‌లో రాజకీయ కల్లోలం.. సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా నియామకం!
![]() |
Nepal Gen Z |
జెన్ జెడ్ ఆగ్రహం: ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. సెప్టెంబర్ 8న ఖాఠ్మండూలో ప్రారంభమైన నిరసనలు, త్వరగా హింసాత్మక రూపం దాల్చాయి.
- పార్లమెంట్ భవనం, మంత్రుల ఇళ్లపై దాడులు
- పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లైవ్ ఫైరింగ్
- 19-31 మంది మరణాలు, వేలాది మంది గాయాలు
ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించి, కర్ఫ్యూ విధించింది. దీని ఫలితంగా యువత పోరాటం కేవలం అవినీతి వ్యతిరేక ఉద్యమంగా కాకుండా, ప్రభుత్వ దమనకర విధానాలపై తిరుగుబాటుగా మారింది.
ఓలీ రాజీనామా - కొత్త మార్పు: ఈ హింసాత్మక ఆందోళనలు చివరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారి తీశాయి. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ యువత నాయకులతో చర్చలు జరుపుతుండగా, సైన్యం రాజ్యాంగపరమైన పరిష్కారాలను కోరుతోంది.
యువత ప్రధాన డిమాండ్లు:
- అవినీతి విచారణలు
- రాజ్యాంగ మార్పులు
- మరణించినవారి కుటుంబాలకు సహాయం
- రాజకీయ నేతల ఆస్తులపై దర్యాప్తు
మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ ఇంటరిమ్ పీఎంగా ఎంపికైన వార్తలు ట్రెండింగ్ అవుతుండగా, ఇది యువత ఆశలకు కొత్త రూపం ఇస్తోంది.
Also Read: నేపాల్‌లో అల్లర్లు.. అమెరికా-చైనా కుట్రలేనా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS