Gen Z: నేపాల్ లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసినప్పటికి, కొన్ని హింసాత్మక చర్యలు జరిగినందున ఆ దేశంలో అత్యావసర పరిస్థితిని ప్రకటించారు. ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టారు. ప్రజల ఆందోళనల వెనుక ఎవరు ఉన్నారు? అనే చర్చకు ప్రధాన కారణం జెనరేషన్ జెడ్ (Gen Z) గా పేరొందిన యువత సారథ్యం వహించడం.
![]() |
Gen Z |
నేపాల్‌లో 'జెన్ జెడ్' పేరుతో ఒక నిర్దిష్ట ఉద్యమం జరగడం, ప్రభుత్వం దిగిపోవడం సంచలనమైంది. ఈ జెన్ జెడ్ గ్రూప్ సాధారణ సామాజిక శాస్త్ర పదంగా ఉపయోగించబడుతుంది. ఒక తరం కోసం మాట్లాడేటప్పుడు సామాజిక శాస్త్రంలో జెన్ పదాన్ని వాడుతారు. జెన్ జెడ్ తరహా కొన్ని గ్రూపులు సమూహాల కోసం ఆధునిక సామాజిక శాస్త్రంలో ప్రస్తావించారు. ఈ శతాబ్దంలో పుట్టిన వ్యక్తుల వయసుల ఆధారంగా జెన్ గ్రూపులకు పేర్లు పెట్టడం ప్రారంభమైంది. ఆధునిక సమాజంలో తరాలను విభజించడానికి ‘జెనరేషనల్ కోహోర్ట్స్’ అనే భావన తీసుకువచ్చారు.
ఒకే కాలంలో పుట్టిన వ్యక్తులు, తమ జీవితంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంఘటనలను అనుభవిస్తారు కాబట్టి, వారి ఆలోచనలు, విలువలు, నమ్మకాల్లో సారూప్యత ఉంటుంది అని జర్మన్ సామాజిక శాస్త్రవేత్త కార్ల్ మ్యాన్హైమ్ 1923లో "ది ప్రాబ్లెమ్ ఆఫ్ జెనరేషన్స్"లో చెప్పారు. తరువాత, ఆధునిక తరాల జెన్ గ్రూపుల లక్షణాలను విశ్లేషించినవారు విలియం స్ట్రాస్, నీల్ హోవ్. వీరు 1991లో రాసిన Generations: The History of America's Future, 1584 to 2069 పుస్తకంలో దీన్ని వివరించారు.
Also Read: పుట్టిన సంవత్సరాన్నిబట్టి మీ తరం తెలుసుకోండి.!
‘జెన్ Z’ (Gen Z) అనేది 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని సూచిస్తుంది. వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఇంటర్నెట్, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లతో పెరిగినవారు. నేపాల్‌లో ఉద్యమం చెలరేగడానికి ప్రధాన కారణం కూడా డిజిటల్ సౌలభ్యాన్ని వీరి నుండి దూరం చేయడమే. అవినీతి, ఆర్థిక అసమానతలు, యువతలో నిరుద్యోగం వంటి సమస్యలు యవతలో ఆగ్రహం పెంచాయి. సోషల్ మీడియా నిషేధం ఈ ఆగ్రహానికి మరింత వడ్డింపు పోసింది.
![]() |
Nepal Gen Z Protest |
నేపాల్ మంత్రుల జీవితం తలకిందులు ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ప్రభుత్వం నిషేధించింది. యువత, ముఖ్యంగా జెన్ జెడ్ గ్రూప్, ఈ చర్యను అంగీకరించలేకపోయింది. తాము వృద్ధిచేసిన డిజిటల్ ప్రపంచాన్ని కుదించారని భావించి ప్రభుత్వం మీద తిరుగుబాటుకు ముందయ్యారు. ఇలాంటి ఉద్యమాలు గతంలో అమెరికా, స్వీడెన్, హాంకాంగ్‌లో కూడా జెన్ జెడ్ గ్రూపులచే జరిగాయి.
జెన్ జెడ్ తరహాలో మరికొన్ని గ్రూపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ది గ్రేటెస్ట్ జనరేషన్ (The Greatest Generation) 1901 నుంచి 1927 మధ్య జన్మించినవారికి సంబంధించినది. వారు ప్రపంచ యుద్ధాలను చూసినవారుగా, గొప్ప తరంగా పిలుస్తారు. తరువాతి తరాన్ని సైలెంట్ జనరేషన్ (Silent Generation) అంటారు, 1928-1945 మధ్య జన్మించినవారు. వీరు ఎక్కువగా సైనికులు లేదా యుద్ధానంతర సమాజంలో భాగంగా ఉన్నారని చెప్పబడింది.
![]() |
Generation Types |
1945 తర్వాత జన్మించినవారిని బేబీ బూమర్స్ (Baby Boomers) అంటారు, వీరు 1946-1964 మధ్య జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించినవారు. 1965-1980 మధ్య జన్మించిన వారిని జనరేషన్ X (Generation X) అంటారు, ఈ మధ్య తరపు వ్యక్తులు సాధారణంగా స్వతంత్రంగా ఉంటారని చెబుతారు. 1981-1996 మధ్య జన్మించిన వారు మిలీనియల్స్ లేదా జనరేషన్ Yగా పిలుస్తారు. 1997-2012 మధ్య జన్మించిన వారు పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగారు. సామాజిక శాస్త్రం ప్రకారం, ఈ గ్రూపులు అనేక సమస్యలపై ఆన్‌లైన్ వేదికలో స్పందిస్తూ, తక్కువ సమయంలో ఏకమవుతారని పరిశీలించబడింది.
Also Read: రెండు వరుస గ్రహణాలు.. నేపాల్ నుంచి ఫ్రాన్స్ వరకు రాజకీయ కల్లోలం!
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS