Operation Polo: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు మాత్రం ఆ స్వేచ్ఛను పొందలేదు. దీంతో ప్రజలు విప్లవం మొదలుపెట్టగా, చివరికి నిజాం తన సంస్థానాన్ని భారత్‌లో కలపక తప్పలేదు. దీని వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. అప్పుడు దీనిని హైదరాబాద్ సంస్థానం అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో తెలంగాణతో పాటు మరాఠ్వాడ, ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు కూడా ఉండేవి. మొత్తం 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలంగాణకు చెందినవే.
![]() |
Operation Polo |
వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, రచయితలు, ప్రజాస్వామ్యవాదులు, ఆర్య సమాజ్ తో పాటు సామాన్య ప్రజల పోరాట ఫలితంగా హైదరాబాద్ సంస్థానం స్వాతంత్య్రం పొందింది. నిజాం సంస్థానంలో జరుగుతున్న దురాగతాలపై అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ స్పందించారు. ఆయన ఆదేశాలతో జనరల్ జే.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య ప్రారంభమైంది. దీనికే ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. సైన్యం రెండు దిశల్లో కదిలింది ఒకటి విజయవాడ వైపు నుంచి, మరొకటి బీదర్ వైపు నుంచి.
మొదట రజాకార్లు ప్రతిఘటించినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో నిజాం నవాబు, భారత ప్రభుత్వ ప్రతినిధి కే.ఎం. మున్షీని కలసి లొంగిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆపరేషన్ పోలో విజయవంతమై, సైనిక చర్య ముగిసింది. ఆ సమయంలో సైనిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎం.కే. వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించారు.
Also Read: భారత్‌పై ఆధారపడే దేశాలు ఇవే! నేపాల్ నుంచి ఖతర్ వరకు భారత్ సహాయం
మరిన్ని Interesting Facts కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS