Car Mileage Tips:పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలామంది పెట్రోల్, డీజిల్ వాహనాలపై ఆధారపడి ఉన్నారు. ఈ వాహనాల్లో ఒక సాధారణ సమస్య మైలేజ్ తగ్గిపోవడం. వాహనం ఎక్కువ ఇంధనం వినియోగించడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
![]() |
Car Mileage Tips |
పాత ఇంజిన్ ప్రభావం: వాహనం ఇంజిన్ పాతదైతే దాని పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా మైలేజ్ కూడా తగ్గుతుంది. పిస్టన్, రింగులు, సిలిండర్ అరిగిపోవడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. కాబట్టి ఇంజిన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయించడం చాలా ముఖ్యం.
నాణ్యత లేని ఇంధనం: మీరు నాణ్యత లేని పెట్రోల్ లేదా డీజిల్ వాడితే అది నేరుగా మైలేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రతిసారి ఆయిల్ నింపే ముందు దాని నాణ్యతను పరిశీలించాలి. శ్రద్ధగా చూసుకుంటే ఇంజిన్ కూడా సాఫీగా పనిచేస్తుంది.
డ్రైవింగ్ అలవాట్ల ప్రభావం: అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం, పదేపదే బ్రేకులు వేయడం, మళ్లీ వేగం పెంచడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. ఈ రకమైన అలవాట్లు ఇంజిన్‌పై అధిక ఒత్తిడిని కలిగించి మైలేజ్ తగ్గించేస్తాయి. కాబట్టి డ్రైవింగ్‌లో జాగ్రత్తలు అవసరం.
పరిష్కార మార్గాలు: వాహనం మైలేజ్ మెరుగుపరచుకోవాలనుకుంటే ఇంజిన్‌ను నిరంతరం సర్వీస్ చేయించుకోవాలి. అధిక వేగంతో డ్రైవింగ్ చేయడాన్ని నివారించాలి. అలాగే ఆయిల్ నింపేటప్పుడు ఎల్లప్పుడూ నాణ్యమైన ఇంధనం వాడేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మైలేజ్ మెరుగుపడటమే కాకుండా వాహనం కూడా ఎక్కువ కాలం సజావుగా నడుస్తుంది.