Things to Bring Home for Diwali: దీపావళి పండుగలో ఏ వస్తువులను ఇంట్లోకి తీసుకురావాలి?

Things to Bring Home for Diwali: మరికొద్ది రోజుల్లోనే దీపావళి పండుగ రానుంది. ఈ ప్రత్యేక రోజున ప్రతి ఇంటిని దీపాలతో అలంకరించి, లక్ష్మీదేవిని, విఘ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అయితే, కేవలం పూజ మాత్రమే కాకుండా, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం పొందవచ్చని నమ్మకం ఉంది.

Things to Bring Home for Diwali
Things to Bring Home for Diwali

తాబేలును ఇంటికి తెచ్చుకోవడం: ఈ సంవత్సరం అక్టోబర్ 20న దీపావళి పండుగ జరుపుకోనున్నారు. వాస్తు ప్రకారం తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. తాబేలు విష్ణుమూర్తి యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువల్ల దీపావళికి ముందు లోహంతో తయారు చేసిన తాబేలును ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. 

అదేవిధంగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది. దీపావళి రోజున తీసుకువచ్చిన తాబేలు ను ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో ఉంచడం శుభప్రదం.


కొబ్బరికాయ తీసుకురావడం: దీపావళికి ఒక రోజు ముందు ఇంటికి కొబ్బరికాయను తెచ్చుకోవాలి. దీనిని ఇంటికి తెచ్చినప్పుడు, దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. తర్వాతి రోజు, అంటే దీపావళి పండుగ రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించాలి. 

ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఏవైనా దోషాలు తొలగిపోతాయని, శుభఫలితాలు పొందే అవకాశం ఉందని నమ్మకం ఉంది.

తులసి మొక్క ప్రాముఖ్యత: ఇంట్లో తులసి మొక్క లేని వారు దీపావళి రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం అత్యంత శ్రేయస్కరం. తులసి మొక్కను స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంట్లో పాజిటివిటీని పెంచడమే కాకుండా, ఆనందం, ఆరోగ్యం, శాంతిని ప్రసాదిస్తుంది. 

ఈ మొక్కను ఇంట్లో ఈశాన్య దిశలో నాటాలి. ప్రతి రోజు భక్తితో పూజిస్తే శుభ ఫలితాలు మరింతగా లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post