Car Mileage Tips: కార్ మైలేజ్, పికప్ పెంచే సులభమైన మార్గాలు తెలుసా?

Car Mileage Tips: కారు డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని సరైన అలవాట్లు పాటించడం ద్వారా కారు మైలేజ్‌తో పాటు పికప్‌ను కూడా మెరుగుపరచుకోవచ్చు. దీంతో తక్కువ ఇంధన వినియోగంతో కారు బెహ్వియర్ చేస్తుంది. ఫలితంగా పెట్రోల్ ఖర్చు, సర్వీస్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు కారులోని ఇంజిన్ పార్ట్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అలాంటి బెస్ట్ డ్రైవింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

Car Mileage Tips
Car Mileage Tips

ఫ్యుయెల్ నింపడం: చాలామంది కారులో పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేస్తారు. అయితే నిపుణుల ప్రకారం ఇది పొరపాటు. ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల ఫ్యుయెల్ పంప్‌పై ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ఒకవేళ ఫ్యుయెల్ పంప్ పాడైతే దాన్ని రీప్లేస్ చేయడానికి రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చవుతుంది. అందుకే ఎల్లప్పుడూ సగం ట్యాంక్ కంటే కొద్దిగా ఎక్కువ మాత్రమే నింపాలి. అలాగే ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వదిలేయకూడదు. లో ఫ్యుయెల్ ఇండికేటర్ రాగానే నింపడం మంచిది.

ఫ్యుయెల్ క్వాలిటీ: కారులో ఇంధనం నింపేముందు ఆ బంక్‌లో నాణ్యమైన ఫ్యుయెల్ అందిస్తున్నారో చెక్ చేసుకోవాలి. కల్తీ ఇంధనం నింపితే, అందులోని ధూళి, నీరు కారణంగా ఇంజిన్ పాడవచ్చు. తద్వారా ఆయిల్ ఫిల్టర్, ఇంజెక్టర్లు మార్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఎల్లప్పుడూ నమ్మదగిన పెట్రోల్ బంకుల్లోనే ఫ్యుయెల్ నింపడం ఉత్తమం.

ఫ్యుయెల్ ఫిల్టర్‌ చెక్: ఫ్యుయెల్ ఫిల్టర్ ఇంధనంలోని ధూళి, తుప్పు, ఇతర కణాలను ఇంజిన్‌లోకి వెళ్లకుండా ఫిల్టర్ చేస్తుంది. అయితే కొంత కాలానికి ఫిల్టర్ మురికి పట్టి మూసుకుపోతుంది, ఫలితంగా ఇంజిన్‌కు అందే ఫ్యుయెల్ తగ్గి మైలేజ్ కూడా తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్ సర్వీసింగ్ సమయంలో ఫ్యుయెల్ ఫిల్టర్‌ను మార్చుతూ ఉండటం చాలా ముఖ్యం.


Post a Comment (0)
Previous Post Next Post