Gaganyaan Mission 2040: భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం.. 2040లో చంద్రుడిపై వ్యోమగాములు!

Gaganyaan Mission 2040: భారత్‌ నుంచి వ్యోమగాములు 2040 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా చంద్రుడి వైపు మరొక కీలక ప్రయోగం జరగనుందని, ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.

Gaganyaan Mission 2040
Gaganyaan Mission 2040

చంద్రుడి రహస్యాలను ఆవిష్కరించేందుకు ఇస్రో ఇప్పటివరకు చంద్రయాన్ సిరీస్‌లో మూడు విజయవంతమైన ప్రయోగాలు చేపట్టింది. ప్రపంచంలో నాసా సహా ఏ దేశం సాధించలేని అనేక విశేషాలను చంద్రయాన్ మిషన్ల ద్వారా ఇస్రో ప్రపంచానికి తెలియజేసింది. చంద్రుడిపై మనుషులను పంపే ప్రణాళికకు ఇస్రో ఐదేళ్ల క్రితమే శ్రీకారం చుట్టగా, దీనికి “గగనయాన్” అనే పేరు పెట్టి దశలవారీగా ప్రయోగాత్మక పరీక్షలను కొనసాగిస్తోంది.

Also Read: ఎవరీ శుభాంశు శుక్లా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడు..

అంతరిక్ష పరిశోధనలో భారత్‌ ప్రస్తుతానికి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలుస్తోంది. ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ దేశ ప్రధాన అంతరిక్ష లక్ష్యాలను వివరిస్తూ, భారత తొలి మానవ అంతరిక్ష విమాన మిషన్ 2040లో జరగనుందని ధృవీకరించారు. చంద్రుని అన్వేషణతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యం కోసం కూడా ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

గగనయాన్ మాన్‌డ్ మిషన్‌లో భాగంగా 2027లో కీలకమైన మానవరహిత ప్రయోగం చేపట్టనున్నారు. చంద్రుడిపై వ్యోమగాములు దిగే ప్రదేశాన్ని ముందుగానే నిర్ధారించుకోవడం, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం, ముఖ్యమైన డేటాను సేకరించడం కోసం ఈ మిషన్‌ను నిర్వహిస్తామని ఇస్రో స్పష్టం చేసింది.

భారత అంతరిక్ష ఘనతపై ప్రస్తావిస్తూ నారాయణన్, దేశం తొమ్మిది అంతరిక్ష విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థాయిలో ఉందని తెలిపారు. చంద్రయాన్-1 మిషన్‌తో చంద్రుడిపై నీటిని కనుగొనడం నుండి, చంద్రయాన్-3 మిషన్‌తో చంద్రుడి దక్షిణ ధ్రువానికి సురక్షితంగా ల్యాండింగ్ చేయడం వరకు ఇస్రో ఎన్నో విజయాలను సాధించింది. 2040 నాటికి మానవ చంద్ర మిషన్ చేపట్టడం ప్రధాని నిర్దేశించిన ప్రతిష్ఠాత్మక లక్ష్యమని, చంద్రునికి వ్యోమగాములను పంపించి సురక్షితంగా తిరిగి భూమికి రప్పించే సామర్థ్యం ఇస్రో సాధించగలదని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఆదిత్య L1 మిషన్ ఇప్పటికే 15 టెరాబిట్‌లకు పైగా సౌర డేటాను అందించిందని, దీని ద్వారా కరోనల్ మాస్ ఎజెక్షన్‌లు, అంతరిక్ష వాతావరణంపై లోతైన అధ్యయనం సాధ్యమైందని ఆయన తెలిపారు.

భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా, ఇస్రో 80,000 కిలోల బరువును లోయర్ ఎర్త్ ఆర్బిట్‌కి తీసుకెళ్లగలిగే హెవీ-లిఫ్ట్ రాకెట్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు గరిష్టంగా 5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టగా, త్వరలో 8 టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా పంపగలిగే శక్తివంతమైన వాహక రాకెట్ అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ప్రకటించారు.

Also Read: భూమిపై విజయవంతంగా ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం..


Post a Comment (0)
Previous Post Next Post