Fuel Filling Tips for Car: కారును సరిగ్గా మెయింటెయిన్ చేయాలనుకునే వారు, కారులో పెట్రోల్/డీజిల్ ఎలా నింపాలి? ఎంత నింపాలి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అయితే ఈ విషయాల్లో చాలామందికి తెలియని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
![]() |
Fuel Filling Tips for Car |
ఫుల్ ట్యాంక్ సమస్య: చాలామంది కారు యజమానులు తరచూ చేసే పొరపాటు ఫ్యూయెల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపేయడం. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ట్యాంక్ ఫుల్‌గా ఉన్నప్పుడు ఫ్యూయెల్ ఫ్లో సరిగా జరగకపోవచ్చు. ట్యాంక్‌లో గాలి లేకపోవడం వల్ల ఇంధనం ఇంజిన్‌కి నెమ్మదిగా చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ట్యాంక్‌ను పూర్తిగా నింపడం మంచిది కాదు.
కారు నడుస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు, గుంతలు దాటేటప్పుడు ట్యాంక్‌లో ఉన్న ఫ్యూయెల్ కదలడం సహజం. కానీ ట్యాంక్ పూర్తిగా నిండివుంటే, కదిలిన ఇంధనం బయటకు చిమ్మే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్యూయెల్ ప్రెజర్‌లో మార్పులు వచ్చి ఇంజిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ కూడా పట్టే ప్రమాదం ఉంది.
Also Read: ఎలక్ట్రిక్ బైక్ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. లేకపోతే ఇబ్బందులే!
ఎంత ఫ్యూయెల్ నింపాలి?
ప్రతి కారు ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా ట్యాంక్ కెపాసిటీ కన్నా ఒక లీటర్ తక్కువగా నింపడం మంచిది. ఉదాహరణకు, ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే, సుమారు 19 లీటర్ల వరకే నింపాలి. మరో మార్గం ఏమిటంటే, పెట్రోల్ బంక్‌లో నింపేటప్పుడు మొదటి ఆటో-కట్ రాగానే ఆపమని చెప్పడం. ఇలా చేస్తే ఎటువంటి సమస్య ఉండదు.
ఎంప్టీ ట్యాంక్ నష్టం: ఫుల్ ట్యాంక్ కంటే ఎంప్టీ ట్యాంక్ వల్ల కలిగే నష్టం మరింత ఎక్కువ. తరచుగా చాలా తక్కువ ఇంధనం మాత్రమే నింపడం వలన ప్రెజర్‌లో మార్పులు ఏర్పడి, ఇంజిన్ స్టార్ట్ కాకపోవచ్చు. అందువల్ల ఎప్పుడూ ట్యాంక్‌లో కనీసం నాలుగో వంతు ఇంధనం ఉండేలా చూసుకోవాలి.
ఇతర జాగ్రత్తలు
- ఫ్యూయెల్ నింపేటప్పుడు కారు ఇంజిన్ ఆపేయాలి.
- ఫ్యూయెల్ పంప్ గొట్టం ట్యాంక్ లోపల పూర్తిగా వెళ్లిందో లేదో తప్పక చూసుకోవాలి. లేకపోతే ఫ్యూయెల్ లీక్ అవ్వవచ్చు.
- చిన్న లీక్ అయినా వెంటనే క్లాత్‌తో తుడవాలి.
- లాంగ్ జర్నీ కోసం కొంతమంది క్యాన్‌లలో పెట్రోల్/డీజిల్ తీసుకెళ్తారు. ఇది ప్రమాదకరం. వీలైనంత వరకు ఇలా చేయకపోవడం మంచిది.
ఈ సూచనలు పాటించడం ద్వారా కారు ఇంజిన్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, ప్రమాదాలను కూడా నివారించవచ్చు.
Also Read: సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS