September 2025 Horoscope: సెప్టెంబర్ నెల వచ్చేసింది. అయితే ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.
![]() |
| September 2025 Horoscope |
మకర రాశి:- మకర రాశి వారికి సెప్టెంబర్ నెల కష్టకాలం అని చెప్పాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారవేత్తలు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. అలా చేస్తే లాభాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం.. ఆరు రాశులకు పట్టిందల్లా బంగారం!
మిథున రాశి:- మిథున రాశి వారికి ఈ నెల కఠిన సమయం. శత్రువులు కుట్రలు పన్నవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. తోబుట్టువులతో బంధం బలహీనపడే అవకాశం ఉంది. చికాకులు పెరుగుతాయి.
సింహ రాశి:- సింహ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక ఖర్చులు సమస్యలకు దారి తీస్తాయి. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కాబట్టి అనవసర విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. సమాజంలో గౌరవం పెరిగినా, కొన్ని చికాకులు సమస్యల్లోకి నెట్టేస్తాయి.
విద్యార్థులు, వ్యాపారులు:- విద్యార్థులకు ఈ నెల కష్టకాలం. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
