Lunar Eclipse Astrology 2025: సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం.. ఆరు రాశులకు పట్టిందల్లా బంగారం!

Lunar Eclipse Astrology 2025: గ్రహాల మార్పులతో కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రత్యేకమైన రోజుల్లో వాటి ఫలితాలు మరింతగా ఉంటాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న రెండవ చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది రాహు గ్రస్త చంద్రగ్రహణం కావడంతో పాటు భారతదేశంలో స్పష్టంగా దర్శనమిస్తుంది. అందువల్ల ఇక్కడ సూతకాలం అమల్లోకి వస్తుందని ఇప్పటికే అనేక మంది పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలనేది వారి సూచన. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ధనయోగం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మరి ఆ రాశులు ఏవో చూద్దాం.

Lunar Eclipse Astrology 2025
Lunar Eclipse Astrology 2025

మేషరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. వీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పట్టినది బంగారమే అవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

వృషభరాశి వారికి చంద్రగ్రహణం తరువాత శుక్రబలం పెరుగుతుంది. దాంతో సంపాదన కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు వస్తాయి. అప్పుగా ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని గ్రహాల అనుకూల ప్రభావంతో ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

Lunar Eclipse Astrology 2025
Chandra Grahan -2025

తులారాశి వారు సెప్టెంబర్ 7 తరువాత పట్టినది బంగారమే అవుతుంది. వీరు చేసే ప్రయత్నాలు అన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారులకు మంచి ఆదాయం వస్తుంది. అర్హులైన వారికి వివాహం కుదురుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇదే సరైన సమయం. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునేవారికి అనుకూల కాలం. అనుకోకుండా ప్రయాణాలు జరుగుతాయి. ఈ ప్రయాణాలు వారికి ఆనందం కలిగిస్తాయి.

మకరరాశి ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి సంబంధిత ప్రయాణాలు లాభదాయకం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీలో అవకాశం వస్తుంది. అనుకోకుండా ధనలాభం కలిగినా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వస్తువుల కొనుగోళ్లో జాగ్రత్త అవసరం.

మీనరాశి వారికి ఇకనుంచి లాభాలు విస్తరిస్తాయి. గతంలో ప్రారంభించిన వ్యాపారం ఇకనుంచి మంచి లాభాలను ఇస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం ఉంది. ధనలాభం మరింతగా పెరుగుతుంది. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఆస్తి వివాదాలు సులభంగా పరిష్కారం అవుతాయి. సోదరుల మధ్య సఖ్యత ఉండడం వల్ల వ్యాపార లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురుగ్రహ బలం పెరగడంతో పెళ్లిళ్లు జరగే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post