Alien attack in November: నవంబర్‌లో ఏలియన్స్ దాడి? భూమిపైకి దూసుకొస్తున్న రహస్య వస్తువు!

Alien attack in November: భూమిపైకి దాడి చేసేందుకు గ్రహాంతరవాసులు వస్తున్నారా? నవంబర్‌లోనే భూమిపై అటాక్ జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. గ్రహాంతరవాసులు అనే పదం మనం తరచుగా వింటూనే ఉంటాం. ఈ కాన్సెప్ట్‌పై వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. కానీ కథల్లోనే చూసే ఈ గ్రహాంతరవాసులు ఇప్పుడు నిజంగానే మన ముందుకు రానున్నారా? అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Alien attack in November
Alien attack in November

న్యూయార్క్ నగరంలోని మాన్‌హాటన్‌ ప్రాంతం పరిమాణంతో సమానంగా ఉన్న ఒక రహస్య వస్తువు, అంతరిక్షం నుంచి భూమి వైపు అత్యంత వేగంతో దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. మొదట ఇది సాధారణ గ్రహశకలమేనని భావించినా, తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

గంటకు 60 కిలోమీటర్ల వేగం: భూమివైపు వస్తున్న ఆ వస్తువు వెడల్పు దాదాపు 1020 కిలోమీటర్ల వరకు ఉంటుందని, సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా. సాధారణంగా అంతరిక్షం నుంచి వచ్చే అనేక గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే దగ్ధమైపోతాయి. కానీ ఈసారి వస్తున్న రహస్య వస్తువు మాత్రం గ్రహాంతరవాసుల వ్యోమనౌక కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


నవంబర్ నాటికి ఢీకొట్టే అవకాశమా..?: శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ వస్తువు నవంబర్ లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్నే 3ఐ/అట్లాస్ అని పిలుస్తున్నారు. ముందుగా దీన్ని A11PL3Z అని పిలిచేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీని గురించి ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఇది కేవలం గ్రహశకలం కాకుండా, గ్రహాంతర సాంకేతిక పరికరం అయి ఉండవచ్చని అంటున్నారు. ఖగోళ శాస్త్రవేత్త అవీ లోయెబ్‌ కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఆయన గతంలో 2017లో కనుగొన్న ‘ఒవుమువామువా’ అనే అంతరిక్ష వస్తువు కూడా భిన్న గ్రహాల జీవులు సృష్టించిన కృత్రిమ వస్తువే కావచ్చని పేర్కొన్నారు.

Alien attack in November
Mysterious Object 3I/ATLAS Approaches Earth

గుర్తించే లోపలే దాడి..?: శాస్త్రవేత్తల ప్రకారం, ఒకవేళ 3ఐ/అట్లాస్ నిజంగానే వ్యోమనౌక అయితే, అది మనం పూర్తిగా గుర్తించేలోపలే దాడి చేసే అవకాశముంది. ప్రస్తుత గమనాన్ని బట్టి చూస్తే నవంబర్ చివర్లో అది సూర్యుడి దగ్గరగా వెళ్ళనుందని భావిస్తున్నారు. సూర్యుడి దగ్గరగా వెళ్తే భూమి నుంచి కనిపించడం కష్టమవుతుంది. అంటే రహస్యంగానే భూమిపైకి దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టే. దీన్ని తొలిసారిగా చిలీలోని అట్లాస్‌ సర్వే టెలిస్కోప్ గుర్తించింది.

నిజంగా ఢీకొడుతుందా..?: ఇప్పటికీ 3ఐ/అట్లాస్ నిజంగానే భూమిని ఢీకొడుతుందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేని విషయమే. ఇది కేవలం సిద్ధాంతాత్మక అంచనా మాత్రమే. అయినప్పటికీ ఈ నివేదికను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ వస్తువు భూమిని ఢీకొడితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూమిని రక్షించడానికి ముందుగానే వ్యూహాలు రూపొందించుకోవాలని సూచనలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం మన టెక్నాలజీ పరిమితుల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు ఎంతవరకు విజయవంతం అవుతాయో అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post