Tirumala Koppera Hundi Story: వందల ఏళ్లుగా కొనసాగుతున్న తిరుమల కొప్పెర హుండీ సంప్రదాయం!

Tirumala Koppera Hundi Story: భారతదేశంలోని ఆలయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల తిరుపతి ఆలయం గురించి విదేశీయులు కూడా తెలుసుకుని తప్పక సందర్శించాలని భావిస్తారు. అందుకే విదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో తిరుమల ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో స్వామివారి దర్శనం పొందడం చాలాసార్లు కష్టతరమవుతుంది.

Tirumala Koppera Hundi Story
Tirumala Koppera Hundi Story

అయినప్పటికీ ఎంత కష్టం అయినా శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. దేవుడిని దర్శించుకోవడమే కాకుండా ఏదో ఒక కానుకను సమర్పించాలని కూడా భక్తులు ఆరాటపడుతారు. ఈ కారణంగానే ఎంతోమంది తమకు తోచిన రూపంలో కానుకలు అందిస్తుంటారు. కొందరు పెద్ద మొత్తాల్లో బంగారం, వెండి కూడా సమర్పిస్తారు. ఇలాంటి సమర్పణల కోసం ఆలయంలో ప్రత్యేక హుండీలు ఏర్పాటు చేశారు. వీటినే "కొప్పెర" అని పిలుస్తారు. కానీ ఈ పేరుకి, ఆచారానికి వెనుక ఉన్న కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

సాధారణంగా కొప్పెర అనేది వెడల్పైన నోరు కలిగిన ఒక లోహపు పాత్ర. పూర్వ కాలంలో ప్రతి ఇంటిలో ఇది ఉండటం సాధారణం. కానీ తిరుమలలో ఉండే కొప్పెర ప్రత్యేకమైనది. తిరుమల ఆలయానికి వందల ఏళ్లుగా భక్తులు వస్తున్నారు. ప్రారంభంలో వచ్చిన వారు తమకు తోచిన విధంగా నాణేలు సమర్పించేవారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సమర్పణలు కూడా అధికమవ్వడంతో ప్రత్యేకంగా ఒక పాత్ర అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో కొప్పెర లాంటి పాత్రను పెట్టి దానికి తెల్లని గుడ్డ కట్టారు. మొదట్లో చిన్నవిగా ఉన్నా, భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇవి పొడవుగా తయారు అయ్యాయి. ఇప్పుడైతే ఆలయంలో ఇలాంటివి పదులకొద్ది ఉన్నా కూడా అవి సరిపోవడం కష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒక కానుకను సమర్పిస్తారు. కొందరు తమ శరీరంపై ధరించిన ఆభరణాలనే సమర్పించేస్తారు.

Tirumala Koppera Hundi Story
Tirumala Koppera Hundi 

ఈ కొప్పెరలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు నియమించబడ్డారు. వీరి సేవలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ప్రారంభంలో ఈ విధులు నిర్వర్తించిన కుటుంబాలు ఒకేచోట నివసించేవి. ఆ ఊరు క్రమంగా "కొప్పెర వాండ్లపల్లి"గా మారింది. ప్రస్తుతం ఇది తిరుమల నుంచి శ్రీనివాస మంగాపురానికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. వీరి బాధ్యత కేవలం హుండీలు మార్చడమే కాకుండా, అందులో పడిన నగదు, ఆభరణాలను లెక్కించడం కూడా.

హుండీలో వచ్చిన సమర్పణలను వేరు చేసే ప్రక్రియను "పరాకమని" అంటారు. హుండీని రోజుకు రెండు సార్లు లెక్కిస్తారు.. ఉదయం నిండినదాన్ని రాత్రి, రాత్రి నిండినదాన్ని మరుసటి రోజు ఉదయం లెక్కిస్తారు. డబ్బు, నగలు, వస్తువులను వేరు చేసి, బంగారు-వజ్రాభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు. అవి అత్యంత విలువైనవని భావిస్తే శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు. నగదు మొత్తాన్ని మాత్రం ఎప్పటిలాగే బ్యాంకులో జమ చేస్తారు.

Also Read: శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఇక్కడ కొట్టుకుంటుంది! 

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post