Bigg Boss Telugu 9 Contestants: బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాల్టీ షో బిగ్బాస్. ఇప్పటివరకు తెలుగు బిగ్బాస్ ఎనిమిది సీజన్లు పూర్తి కాగా, ఇప్పుడు తొమ్మిదో సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ 9 గ్రాండ్‌గా ఆరంభమైంది. ఈ సారి అంచనాలకు అందని ట్విస్టులు, ఆశ్చర్యపరిచే మార్పులు ఉంటాయని ముందుగానే నాగార్జున ప్రకటించారు. అభిమానించే సెలబ్రిటీలు ఒకవైపు, ప్రతిభ చూపే సామాన్యులు మరోవైపు అంటూ బిగ్బాస్ 9ను నాగ్ ఘనంగా లాంచ్ చేశారు. ఈ సీజన్‌లో ఎవరికీ పరీక్షలు తప్పవని బిగ్బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి సెలబ్రిటీలతో పాటు ఆరుగురు సామాన్యులకు కూడా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారెవరో చూద్దాం.
![]() |
Bigg Boss Telugu 9 Contestants |
కంటెస్టెంట్స్ జాబితా
- తనూజ పుట్టస్వామి: సీరియల్ నటి. ముద్ద మందారం సీరియల్ ద్వారా ప్రసిద్ధి పొందారు. కుకు విత్ జాతిరత్నాలు షోలో కూడా పాల్గొన్నారు. హౌస్‌లోకి వస్తున్న విషయం తండ్రికి చెప్పలేదని వెల్లడించగా, నాగ్ ఆమెకు ధైర్యం ఇచ్చారు.
- ఆశా షైనీ (ఫ్లోరా షైనీ): ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, చాలా బాగుంది వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు బిగ్బాస్ ద్వారా రీ-ఎంట్రీ ప్రయత్నం చేస్తున్నారు.
- పవన్ కళ్యాణ్ పడాల (సోల్జర్ కళ్యాణ్): ఆర్మీ ఉద్యోగి. బిగ్బాస్ కోసం సెలవు పెట్టి అగ్నిపరీక్షలో పాల్గొని, విజేతగా నిలిచి మొదటి కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
- జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయ్యారు. తర్వాత కుకు విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నారు.
- శ్రష్టి వర్మ: కొరియోగ్రాఫర్. పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. బిగ్బాస్ షో పట్ల తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
- హరిత హరీశ్ (మాస్క్ మ్యాన్): కామనర్. అగ్నిపరీక్షలో జ్యూరీ సభ్యురాలు బింధు మాధవి ఎంపిక చేశారు. జీవితంలో కష్టకాలంలో బిగ్బాస్ తనకు ఓదార్పు ఇచ్చిందని చెప్పారు.
- భరణి: సీరియల్ నటుడు. స్రవంతి సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారు. హౌస్‌లోకి బాక్స్‌తో రావడంతో బిగ్బాస్ అనుమతించలేదు. తరువాత తిరిగి వచ్చి బాక్స్‌లో ఉన్న చైన్ చూపించారు.
- రీతూ చౌదరి: జబర్దస్త్ ఫేమ్. పలు ప్రోగ్రామ్‌ల ద్వారా పాపులర్ అయ్యి, ఇప్పుడు బిగ్బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు.
- డీమాన్ పవన్: కామనర్. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికై బిగ్బాస్ హౌస్‌లోకి చేరారు.
- సంజన గల్రానీ: బుజ్జిగాడు హీరోయిన్. తన జీవితంలోని కష్టాలు, సవాళ్లు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై వచ్చిన నిందను తుడిచివేయడానికే హౌస్‌లోకి వచ్చానని తెలిపారు.
- రాము రాథోడ్: ఫోక్ సింగర్. రాను బొంబయికి రాను పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇప్పుడు బిగ్బాస్‌లో కంటెస్టెంట్ అయ్యారు.
- శ్రీజ దమ్ము: కామనర్. జ్యూరీ మెంబర్ నవదీప్ ఎంపిక చేశారు. తాను ఎప్పుడూ విజేతగానే భావిస్తానని చెప్పుకొచ్చింది.
- సుమన్ శెట్టి: టాలీవుడ్ కమెడియన్. జయం సినిమాతో కెరీర్ ప్రారంభించి, తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్‌పురి చిత్రాల్లో నటించారు.
- ప్రియశెట్టి: కామనర్. ఆమెను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సెలక్ట్ చేశారు.
- మర్యాద మనీష్: కామనర్. జ్యూరీ మెంబర్ అభిజిత్ ఎంపిక ప్రకారం చివరి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS