Pawan Kalyan OG Pre Release Event: పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (They Call Him OG) సినిమా ఇంకో 18 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు థియేటర్లలో సరైన సినిమాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. మధ్యలో కొన్ని చిన్న సినిమాలు హిట్ కావడం ఉపశమనం కలిగించినా, ఒకప్పుడు ఉన్న స్థితి మాత్రం ఇప్పుడు లేదు. కచ్చితంగా ఒక భారీ విజయవంతమైన సినిమా రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే సింగిల్ స్క్రీన్లు డేంజర్ జోన్‌లో పడినట్టే. ఆ భారీ హిట్ ఓజీ రూపంలోనే వస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
![]() |
Pawan Kalyan OG Pre Release Event |
అక్కడి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి రిలీజ్‌కు 18 రోజులు మిగిలి ఉండగానే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్క నార్త్ అమెరికా నుంచే 42 వేల టికెట్లు అమ్ముడవ్వగా, 12 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 12 కోట్ల రూపాయలు వసూలైనట్టు అంచనా. ఇది సాధారణమైన విషయం కాదు.
Also Read: స్టార్ హీరో నుంచి రాజకీయ నాయకుడి వరకు ఆయన అద్భుత ప్రయాణం!
ఇటీవల విడుదలైన కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఓజీ స్థాయికి దగ్గరగా రాలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే, అభిమానులు మాత్రం మూవీ టీం ప్రమోషన్స్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న అద్భుతమైన మూవీకి కనీస స్థాయిలో కూడా ప్రమోషన్స్ చేయకపోవడం, మేము ఊహించినంతగా ముందుకు రాకపోవడం పట్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
![]() |
Pawan Kalyan OG |
అయితే మేకర్స్ ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. పనులు పూర్తయిన తర్వాత ప్రశాంతంగా ప్రమోషన్స్ ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారట. మరో రెండు రోజుల్లో అన్ని పనులు పూర్తి అవుతాయని, పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా ముగుస్తుందని సమాచారం. ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ జెట్ స్పీడ్‌లో ఉంటాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రెండు ప్రాంతాల్లో నిర్వహించాలనుకుంటున్నారు. ఒకటి విజయవాడలో 19వ తేదీన, మరొకటి హైదరాబాద్‌లో 21వ తేదీన జరగనున్నట్టు టాక్. హైదరాబాద్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: సెలబ్రిటీలు vs కామనర్స్.. బిగ్‌బాస్ సీజన్ 9లోకి ఎవరు ఎంట్రీ ఇచ్చారో చూడండి!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS