Puri Temple Mystery: శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఇక్కడ కొట్టుకుంటుంది!

Puri Temple Mystery: శ్రీకృష్ణుడు.. లోకానికి గీతాసారాన్ని బోధించిన దివ్యజ్ఞాని. "ధర్మ సంస్తాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని యుగయుగాలకూ భూమి మీద అవతరించే వాడిని అని ప్రకటించిన పరమాత్మ. ఆయనకు సంబంధించిన చరిత్రలోనూ, పురాణాలలోనూ ఎన్నో మర్మమైన, భక్తిశ్రద్ధలు కలిగించే విశేషాలు మనం చదవవచ్చు. విశేషంగా పూరీలోని జగన్నాథ ఆలయం మరియు అక్కడ జరిగే రథయాత్ర వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.

Puri Temple Mystery
Puri Temple Mystery

పూరీలో కృష్ణుడిని జగన్నాథుడుగా పూజిస్తారు. అక్కడ తయారయ్యే జగన్నాథ విగ్రహాలు వేప చెక్కతో రూపొందిస్తారు. ఇవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర పేరుతో మార్చబడతాయి. కానీ, విగ్రహం మారినా... అందులోని గుండె మాత్రం మారదు. ఎందుకంటే, అది ఎవ్వరూ చూడలేని, వినడానికి మాత్రమే మిగిలిపోయిన ఒక బ్రహ్మ పదార్థం అని భక్తులు నమ్ముతారు. ఆ బ్రహ్మ పదార్థం ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉందట.


పూరీ జగన్నాథ రథయాత్రను స్కంద పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మ పురాణం వంటి పూజ్య గ్రంథాలలో కూడా పేర్కొన్నారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రథయాత్రలో పాల్గొని, రథాన్ని లాగినవారికి వంద యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఇదే గ్రంధాల్లో, జగన్నాథుడి విగ్రహంలో శ్రీకృష్ణుని గుండె ఉంచబడి ఉందని కూడా ప్రస్తావన వస్తుంది.

పురాణాల ప్రకారం, ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ అవతారం కూడా సృష్టి నియమాల ప్రకారం ముగిసే తరుణం వచ్చింది. తన అవతారానికి పర్యవసానంగా శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచాడు. పాండవులు అతని అంత్యక్రియలు నిర్వహించినప్పుడు, శరీరం అగ్నిలో పూర్తిగా కాలిపోయింది. కానీ… ఆశ్చర్యంగా, ఆ గుండె మాత్రం కాలిపోలెదట. అదే సమయంలో “ఇది బ్రహ్మ పదార్థం… దీన్ని సముద్రంలో కలపండి” అని ఆకాశవాణి ఒక సందేశాన్ని అందించిందట. ఆ మాటలకు గౌరవంగా, పాండవులు ఆ గుండెను సముద్రంలో వదిలారు.

Brahma Padartha - Krishna's Heart is an Ancient Arc Reactor? Mystery of Puri Jagannath Temple
Brahma Padartha - Krishna's Heart is an Ancient Arc Reactor? Mystery of Puri Jagannath Temple 

సముద్రంలో తేలుతూ గుండె దుంగ రూపంలో మారి ఒరిస్సా తీరానికి చేరింది. అదే రాత్రి పూరీ రాజు ఇంద్రద్యూమ్నుడు స్వప్నంలో శ్రీకృష్ణుడి దర్శినమిచ్చాడు. ఆ గుండె సముద్రతీరంలో ఉన్నదని చెప్పి, దానిని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ రోజు ఉదయం రాజు ఆ గుండెను కనుగొని, నమస్కరించి, ఆలయానికి తీసుకెళ్లాడు. దాన్ని జగన్నాథుడి విగ్రహంలో, భక్తితో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి, అది అక్కడే ఉంది.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర సందర్భంగా జగన్నాథుని విగ్రహం మారుతుంది. కానీ పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని (కృష్ణుని గుండెను) పూజారులు తీసి కొత్త విగ్రహంలోనే ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ అత్యంత గోప్యంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. అప్పటి సమయంలో పూరీ క్షేత్రంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేస్తారు, ఆలయ ప్రాంగణానికి భద్రతా బలగాలు (CRPF) కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తాయి. గర్భగుడిలోకి ఎవరూ ప్రవేశించరాదు. కేవలం కొంత మంది సుపరిచిత, సనాతన దీక్షగల పూజారులకే ప్రవేశం ఉంటుంది.

Jagannath Temple in Puri
Jagannath Temple in Puri

అందులోనూ, పూజారులు తమ కళ్లకు గంతలు కట్టుకుంటారు, చేతులకు గుడ్డలు చుట్టుకుంటారు, ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదని నమ్మకం. పూజారుల అనుభవాల ప్రకారం… ఆ పదార్థం మృదువుగా ఉండి, చేతిలోకి తీసుకున్నపుడు అది జీవంతో నిండినట్లు.. కుందేలులా తపతపలాడుతున్నట్లు అనిపిస్తుందట. దాన్ని చూడడం అనేది ఓ పాపంగా భావించి, అలా చూస్తే ప్రాణానికి ముప్పు అనే విశ్వాసం కూడా ఉంది. అందుకే ఈ ప్రక్రియను అత్యంత రహస్యంగా, భక్తి పారవశ్యంతో జరుపుతారు.

ఇంతకీ, ఆ గుండె నిజంగానే కొట్టుకుంటోందా? అది కృష్ణుడి గుండెనేనా? లేక భక్తుల విశ్వాసంలో ఏర్పడిన ఒక ఆధ్యాత్మిక చిహ్నమా? ఇదంతా పురాణాల పునాదులపై నిలబడిన కథ. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.. ఆ గుండె భక్తుల నమ్మకానికి ప్రతీకగా, జగన్నాథునిలో శ్రీకృష్ణుని అనంతమైన ఉనికిగా కొట్టుకుంటూనే ఉందని భావించడంలో అపారమైన ఆధ్యాత్మికత ఉంది.

Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post