Numeros Motors Diplos Max Plus: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసే ప్రముఖ సంస్థ 'న్యూమెరోస్ మోటార్స్'. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు వాటి విడిభాగాల తయారీలో కూడా ప్రత్యేకత కలిగి ఉంది. తాజాగా న్యూమెరోస్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘డిప్లోస్ మ్యాక్స్+’ పేరుతో విడుదలైన ఈ స్కూటర్, గతంలో లభ్యమైన డిప్లోస్ మ్యాక్స్ మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రూపుదిద్దుకుంది. రూపకల్పనతో పాటు సాంకేతిక లక్షణాల్లోనూ ఇది మరింత మెరుగైనదిగా నిలిచింది.
![]() |
Numeros Motors Diplos Max Plus |
డిప్లోస్ అభివృద్ధి చేసిన ఈ డిప్లోస్ మ్యాక్స్+ స్కూటర్, ఇప్పటివరకు న్యూమెరోస్ రూపొందించిన అత్యంత ఆధునిక, ఖరీదైన మోడళ్లలో ఒకటి. ఇందులో తీసుకొచ్చిన కీలకమైన అప్‌గ్రేడ్ డ్యూయల్ లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్.
ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 4kWh సామర్థ్యంతో రూపొందించబడింది. దీని వలన స్కూటర్ పికప్ మాత్రమే కాకుండా రేంజ్ కూడా మెరుగుపడింది. పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 156 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. అదనంగా ఈ స్కూటర్ గంటకు 70 కి.మీ గరిష్ట వేగం అందిస్తుంది. కొత్త డిప్లోస్ మ్యాక్స్+ మోడల్ బ్లేజ్ రెడ్, పియానో బ్లాక్, వోల్ట్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. బెంగళూరులో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,14,999.
డిప్లోస్ మ్యాక్స్+ మాత్రమే కాకుండా, ఇప్పటివరకు వచ్చిన డిప్లోస్ మ్యాక్స్ స్కూటర్లు విశ్వసనీయత, మన్నికతో ప్రత్యేకతను సాధించి భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను తీసుకువచ్చాయి. వీటిని ఏ రకమైన భూభాగంలోనైనా నడపగలగడం మరో విశేషం.
ఇప్పటివరకు న్యూమెరోస్ మోటార్స్ దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కి.మీ దూరం వరకు టెస్ట్ రన్‌లు నిర్వహించింది. కొత్తగా లైనప్‌లో చేరిన డిప్లోస్ మ్యాక్స్+ స్కూటర్ ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.
అదేవిధంగా, ఇందులో యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియోఫెన్సింగ్, మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, ఎక్కువ వెలుతురు ఇచ్చే హై-పర్ఫార్మెన్స్ LED లైటింగ్ సిస్టమ్ కూడా ఇందులో లభ్యం.