Laundry Symbols Explained: బట్టల ట్యాగ్స్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో మీకు తెలుసా..?

Laundry Symbols Explained: బట్టలు కొనడానికి మార్కెట్‌కి లేదా మాల్‌కి వెళ్తుంటాం. అది తక్కువ ధరలో దొరికే టీ-షర్ట్‌ అయినా, ఖరీదైన డ్రెస్సు అయినా ఎక్కువగా డిజైన్, బ్రాండ్‌ చూసి ఎంపిక చేసుకుంటాం. కానీ ప్రతి వస్త్రం ఫాబ్రిక్‌ వేర్వేరుగా ఉండటం వల్ల దానిని చూసుకునే విధానం కూడా భిన్నంగా ఉంటుందని చాలామంది పట్టించుకోరు. 

Laundry Symbols Explained
Laundry Symbols Explained

కొత్త బట్టలు తెచ్చుకున్నాక వాటిని సరైన విధంగా ఉతకకపోవడం, తప్పు పద్ధతిలో ఇస్త్రీ చేయడం, వాషింగ్‌ మెషీన్‌లో వేసేయడం వంటివి చేస్తారు. దీంతో ఆ బట్టలు త్వరగా పాతబడినట్టుగా కనిపిస్తాయి. నిజానికి కొన్ని దుస్తులు చేతితోనే ఉతకాలి, మరికొన్ని మాత్రం డ్రై క్లీనింగ్‌కు మాత్రమే అనువైనవి.

సూచించిన విధంగా కాకుండా ఇస్త్రీ చేయడం వల్ల వస్త్రం ఫాబ్రిక్‌, రంగు రెండూ దెబ్బతింటాయి. అందుకే బట్టలు ఎక్కువకాలం కొత్తలా మెరిసేలా ఉండాలంటే వాటిని సరిగ్గా చూసుకోవడం చాలా అవసరం.


దుస్తుల ట్యాగ్‌ల ప్రాముఖ్యత

బట్టలకు అమర్చిన చిన్న ట్యాగ్‌లు కేవలం స్టైల్ కోసం కావు. వాటిపై ఉన్న సూచనలు బట్టలు ఎలా ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, ఎండలో ఆరబెట్టాలి అనే విషయాలను తెలియజేస్తాయి. చాలా మంది ఈ ట్యాగ్‌లపై ఉన్న గుర్తులను గమనించకుండా వదిలేస్తారు.

Laundry Symbols Explained
Laundry Symbols 

ట్యాగ్‌లపై ఉన్న చిహ్నాల అర్థం

వృత్తం: వృత్తం ఉంటే ఆ బట్టను డ్రై క్లీనింగ్ చేయాలి. వృత్తంలో క్రాస్ ఉంటే డ్రై క్లీనింగ్ అవసరం లేదని అర్థం.

చేతి గుర్తు: చేతితో ఉతకడానికి అనుకూలమని సూచిస్తుంది.

మెలితిరిగిన గుర్తు: వస్త్రాన్ని పిండవచ్చని అర్థం. కానీ దానిపై క్రాస్ ఉంటే పిండరాదు.

ఇస్త్రీ గుర్తు:

  • ఒక చుక్క = లైట్ ఇస్త్రీ
  • రెండు చుక్కలు = సింథటిక్‌ ఫాబ్రిక్‌కి
  • మూడు చుక్కలు = కాటన్ లేదా లినెన్‌కి
  • చుక్కలు లేకపోతే = ఇస్త్రీ చేయరాదు.

చతురస్రంలో వృత్తం: వాషింగ్ మెషీన్‌లో మాత్రమే ఆరబెట్టాలి. దానిపై క్రాస్ ఉంటే ఎండలో ఆరబెట్టవచ్చు.

టబ్ గుర్తు: వాషింగ్ మెషీన్‌లో ఉతకవచ్చు. కానీ ట్యాగ్‌పై చూపిన ఉష్ణోగ్రత (ఉదా: 30°C) దాటకూడదు.

ట్యాగ్‌లలో ఇచ్చిన సూచనల ప్రకారం బట్టలను ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వల్ల అవి ఎక్కువకాలం మన్నికగా ఉండడమే కాకుండా వాటి రంగు, ఆకారం, క్వాలిటీ కూడా నిలబడతాయి.

Also Read: కీ బోర్డుపై అక్షరాలు వరుసక్రమంలో ఎందుకుండవు?

మరిన్ని Interesting Facts కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post