Second-hand Car Buying Tips: ప్రతి ఒక్కరూ తమ డైలీ అవసరాల కోసం సొంత కారు కలిగి ఉండాలని కలలు కంటారు. అయితే కొత్త కారు ధరలు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి, చాలామంది వాడిన (second-hand) కార్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనే సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. టెక్నికల్ నిపుణుల సూచనల ప్రకారం, క్రింద చెప్పిన పాయింట్లు పాటిస్తే మంచి వాహనం ఎంపిక చేసుకోవచ్చు.
![]() |
Second-hand Car Buying |
- ముందుగా బడ్జెట్ నిర్ణయించుకోండి: కారు ఎంపిక ప్రక్రియ మొదలయ్యే ముందు మీ ఆర్థిక పరిమితిని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. బడ్జెట్‌కు మించి వెళ్ళిపోతే అప్పులు, ఆర్థిక ఒత్తిడులు తలెత్తే అవకాశముంది. మీరు ఎంచుకున్న కారును అనేక ప్లాట్‌ఫాంలలో ధరలు పరిశీలించి, సరసమైనదిగా అనిపించేదాన్ని ఎంపిక చేసుకోండి.
- టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి: మీకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసే ముందు దీర్ఘంగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. సాధ్యమైనంత వరకు మెకానిక్‌ను కూడా వెంట తీసుకెళ్లి, వాహనం పరిస్థితిని పరిశీలించాలి. డ్రైవ్ చేయడం ద్వారా బ్రేక్‌లు, సస్పెన్షన్, ఇంజిన్ శబ్దం, గేర్ మార్పు లాంటి అంశాలపై స్పష్టత వస్తుంది.
- ఖర్చుల అంచనా: కారు లోపాలు గమనిస్తే, వాటి మరమ్మత్తులకు ఎంత ఖర్చు అవుతుందో ముందుగానే అంచనా వేయండి. ఆ తర్వాత ఆ ఖర్చును కట్ చేసి బార్గెయిన్ చేయవచ్చు. లేకపోతే, అన్ని మరమ్మత్తులు పూర్తయ్యాక మాత్రమే వాహనం తీసుకుంటానని స్పష్టం చేయండి.
- నిపుణుల ద్వారా తనిఖీ చేయించండి: కారు గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే, నమ్మదగిన మెకానిక్ లేదా కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేయించండి. ఇది భవిష్యత్తులోని ఇబ్బందులను నివారించేందుకు దోహదపడుతుంది.
- సర్వీస్ హిస్టరీని పరిశీలించండి: ఆ కారు గతంలో ఎన్ని సార్లు సర్వీస్ చేయించారో, ఏ ఏ విడి భాగాలు మారాయో వివరంగా తెలుసుకోవాలి. దీని వల్ల కారు మెయింటెనెన్స్ స్టేటస్, యూజ్ హిస్టరీపై స్పష్టత లభిస్తుంది.
- డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో చెక్ చేయండి: చివరిగా, వాహనం పేపర్లను పరిశీలించకపోతే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఇచ్చిన చాసిస్ నెంబర్, ఇంజిన్ నంబర్ వాస్తవ కారుతో సరిపోతున్నాయా అని తేల్చుకోండి. ఎలాంటి వ్యత్యాసం కనపడితే ఆ డీల్‌ను వెంటనే మానేయండి.