India China Bilateral Ties: షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ముందుగా, ఆగస్టు 31న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాలపై బెదిరింపులు జారీ చేస్తున్న సమయంలో జరిగిన ఈ భేటీ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఈ సమావేశంలో రెండు దేశాల నాయకులు, భారత్-చైనా దేశాలు ప్రత్యర్థులు కాకుండా భవిష్యత్ అభివృద్ధి కోసం భాగస్వాములుగా ఉన్నాయని స్పష్టం చేశారు. విభేదాలు వివాదాలుగా మారకూడదనే దృక్పథాన్ని కూడా వారు ఉటంకించారు.
Also Read: దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. పాకిస్తాన్-భారతదేశంలో కూడా ప్రకంపనలు!
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకారం, భారత్-చైనా సంబంధాలు కేవలం ద్వైపాక్షిక ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వృద్ధికి కూడా అవసరమని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు పెంపుదలతో పాటు వాణిజ్య లోటును తగ్గించేందుకు కూడా ఇరువురు నాయకులు చర్చించారు.
ట్రంప్ సుంకాల నేపధ్యంలో, భారత్-చైనా సంబంధాలు ఏ దిశగా సాగాలోపైనా ఇద్దరు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే, 2026లో భారత్ ఆతిథ్యం ఇవ్వబోయే బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు.
Also Read: చైనాలో ప్రధాని మోదీ పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక భేటీ!
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో, రెండు దేశాలు మూడవ దేశాల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్ర వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగించాలనే అంశంపై కూడా ఇరువురు అంగీకరించారు.
2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పరస్పర గౌరవం మరియు సహకారంపై ఆధారపడిన సంబంధం అవసరమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. అమెరికా విధించిన భారీ సుంకాల మధ్య భారత్-చైనా ఆర్థిక సహకారం బలపడటం, ప్రపంచ మార్కెట్లకు సానుకూల సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: చైనాలో మోదీకి ప్రత్యేక బహుమతి ‘హాంగ్కీ L-5’ కారు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
