Afghanistan Earthquake 2025: దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. ఈ ప్రకంపనల ప్రభావంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భూకంప ధాటికి పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారతదేశంలో కూడా కంపనలు నమోదయ్యాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భవనాలు కదలడంతో భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, జలాలాబాద్‌కు ఈశాన్య దిశలో 27 కి.మీ దూరంలో, నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని సుమారు 8 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అంచనాల ప్రకారం, ఈ విపత్తు వల్ల మరణాల సంఖ్య వందల్లోకి చేరే అవకాశముందని USGS పేర్కొంది.
ఆదివారం అర్ధరాత్రి 12:47 గంటలకు మొదటి ప్రకంపనలు చోటుచేసుకోగా, ఆ తర్వాత మరోసారి 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు నంగర్‌హార్ ప్రజారోగ్య విభాగం ప్రతినిధి నకిబుల్లా రహీమి తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ భూకంపం కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు, ఆర్థిక నష్టం గణనీయంగా ఉన్నట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి.
Also Read: చైనాలో మోదీకి ప్రత్యేక బహుమతి ‘హాంగ్కీ L-5’ కారు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
