Narendra Modi Xi Jinping Meeting: చైనాలో ప్రధాని మోదీ పర్యటన.. జిన్‌పింగ్‌తో కీలక భేటీ!

Narendra Modi Xi Jinping Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన SCO (Shanghai Cooperation Organisation) సమావేశంలో పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచంలోని 20కి పైగా దేశాలు హాజరవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ సోమవారం జరగనుంది. ముఖ్యంగా, మోదీ–జిన్‌పింగ్ భేటీ 7 సంవత్సరాల తర్వాత జరగడం విశేషంగా మారింది. అమెరికా సుంకాల నేపథ్యంతో మోదీ చైనా పర్యటన అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది.

Narendra Modi Xi Jinping Meeting

టియాంజిన్‌లో ద్వైపాక్షిక చర్చలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం టియాంజిన్‌లోని యింగ్‌బిన్ హోటల్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇందులో పలు కీలక అంశాలు చర్చించే అవకాశముంది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ కూడా మోదీతో కలిసి ఉన్నారు.


ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన: ప్రధానమంత్రి మోదీ 7 సంవత్సరాల తర్వాత చైనాను సందర్శించారు. జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం భారత-చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. అయితే, ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు కృషి జరుగుతోంది. ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశ్యం సరిహద్దు వివాదాన్ని తగ్గించి, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం.

రెడ్ కార్పెట్ స్వాగతం: టియాంజిన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి, సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ (50%), చైనా (30%), కజకిస్తాన్ (25%), మరియు SCO ఇతర దేశాలపై భారీ సుంకాలు విధించారు. ఈ నేపథ్యంతో SCO సమావేశంలో వాణిజ్య సుంకాల అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.

మోదీ-జిన్‌పింగ్ సమావేశం ప్రాధాన్యం: టియాంజిన్ నగరంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తున్నారు. SCO శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం, రష్యా, చైనాతో పాటు 20కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా సుంకాల వివాదాల మధ్య ఈ సమావేశం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Post a Comment (0)
Previous Post Next Post