Egg vs Paneer vs Chicken: ఈ మధ్య కాలంలో చాలా మంది జిమ్‌కి వెళ్ళి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. అలాంటి సమయంలో వ్యాయామం చేసిన తర్వాత ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం అవుతుంది. ప్రోటీన్ కోసం కొందరు పనీర్ తినమని, మరికొందరు చికెన్ లేదా గుడ్లు తినమని సలహా ఇస్తుంటారు. దీంతో చాలామందికి ఏది మంచిదో అన్న సందేహం వస్తుంది. నిజానికి ఈ మూడు ఆహార పదార్థాలు కూడా ప్రోటీన్‌కి మంచి మూలాలు. వీటిలో మరెన్నో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. కానీ వీటిలో ఏది మిన్నో, వాటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.
![]() |
| Egg vs Paneer |
తక్కువ ధరలో లభించే ప్రోటీన్ వనరులలో గుడ్లు మొదటివి. సాధారణంగా ఒక గుడ్డులో సుమారు 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్ బి, బి12, డి, ఇ, భాస్వరం వంటి అనేక అవసరమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొన స్వచ్ఛమైన ప్రోటీన్‌కి ప్రధాన మూలం. పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఉండి గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి.
Also Read: బిర్యానీ తినడం వలన కలిగే దుష్ప్రభావాలు.. జాగ్రత్తగా ఉండండి!
పనీర్‌లో ప్రోటీన్ ఎంత?
మాంసం తినని వారికి పనీర్ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే 100 గ్రాముల పనీర్‌లో సుమారు 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదనంగా, ఇందులో కార్బోహైడ్రేట్లు, లాక్టోస్ తక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది. పనీర్‌లో కాల్షియం, భాస్వరం కూడా ఎక్కువగా ఉండటంతో ఎముకలు బలంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది.
![]() |
| Paneer vs Chicken |
మాంసాహారుల విషయానికి వస్తే, చికెన్ ప్రధాన ప్రోటీన్ మూలంగా పరిగణించబడుతుంది. హెల్త్‌లైన్ ప్రకారం 100 గ్రాముల చికెన్‌లో 20 నుండి 30 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే ఈ పరిమాణం చికెన్‌ను ఎలా వండుతారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్‌తో పాటు, చికెన్‌లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. నిపుణుల ప్రకారం చికెన్ తీసుకోవడం వలన బరువు నియంత్రణలో ఉండటానికి కూడా సహాయపడుతుంది.
శరీరానికి అవసరమైన ప్రోటీన్
ప్రతి ఒక్కరి వయస్సు, బరువు ఆధారంగా ప్రోటీన్ అవసరం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 75 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు దాదాపు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ మూడు ఆహారాలు కూడా ప్రోటీన్ యొక్క మంచి వనరులు అయినప్పటికీ, వాటి పరిమాణంలో తేడా ఉంటుంది. సాధారణంగా అత్యధిక ప్రోటీన్ చికెన్‌లో లభిస్తుంది. కానీ మీ అవసరాలు, ఆహారపు అలవాట్లు, ప్రాధాన్యతల ప్రకారం వీటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.
Also Read: బాగా నిద్రపోవాలంటే రాత్రి ఏం తినాలి, ఏం తినకూడదు?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

