PM Modi 75th Birthday Gift: తన 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రత్యేక బహుమతి అందించబోతున్నారని ప్రధాని మోదీ నిర్ణయించారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం “స్వస్త్ నారి - సశక్త్ పరివార్ అభియాన్” అనే జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ యోజనలో భాగంగా దేశ వ్యాప్తంగా 75,000 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయబడతాయి. వీటి ద్వారా మహిళలు, పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సేవలను ప్రత్యేకంగా అందించనున్నారు.
![]() |
PM Modi 75th Birthday Gift |
అలాగే పోషకాహారం, ఆరోగ్య అవగాహన, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో “పోషణ్ మాహ్” కార్యక్రమాన్ని కూడా అమలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, శక్తివంతమైన సమాజాలను సృష్టించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్య రంగంలోని ఇతర సంస్థలు ఈ జన్‌భాగీదారీ అభియాన్‌లో భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. “ఇండియా ఫస్ట్” అనే స్పూర్తితో విక్షిత్ భారత్ సాధన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: దసరా, దీపావళి గిఫ్ట్.. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS