Mobile Charger Safety Tips: ఛార్జింగ్ పూర్తయిన తర్వాత చార్జర్‌ను సాకెట్‌లో వదిలేయకండి.. కారణం ఇదే!

Mobile Charger Safety Tips: మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెట్టి, తర్వాత ఫోన్ నుండి కేబుల్ తీసేసి అలాగే వదిలేస్తారు. అలాంటి సందర్భాల్లో చిన్న పిల్లలు కేబుల్ నోట్లో పెట్టుకుని విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 

Mobile Charger Safety Tips

సాధారణంగా ఛార్జర్ సాకెట్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే కేబుల్‌లోకి విద్యుత్ వెళ్తుంది. కానీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సాకెట్‌లో చార్జర్ అలాగే వదిలేస్తే ఏమవుతుంది?

చాలామంది మొబైల్ ఛార్జ్ అయిపోయాక చార్జర్ సాకెట్‌లో అలాగే ఉంచేస్తారు. ఛార్జ్ పూర్తి అయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని అనుకునే వారు ఎక్కువ. కానీ ఇది పొరపాటు. స్విచ్ ఆఫ్ చేసినా చార్జర్ సాకెట్‌లో ఉండటం వలన ఒక్కోసారి హై వోల్టేజ్ రావడంతో చార్జర్ పేలిపోయే అవకాశముంది. 


అంతేకాకుండా ఎక్కువసేపు సాకెట్‌లో ఉంచడం వలన విద్యుత్ ప్రభావంతో చార్జర్ త్వరగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా చార్జర్ త్వరగా పాడైపోతుంది. కాబట్టి చార్జింగ్ పూర్తయ్యాక ఎప్పుడూ చార్జర్‌ను తీసేసి సురక్షితంగా పెట్టుకోవాలి.

ప్రస్తుతం మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో కంపెనీలు చార్జర్ ఇవ్వడం లేదు. దాంతో వేరే డబ్బులు వెచ్చించి చార్జర్ కొనాల్సి వస్తుంది. సాధారణ, లో క్వాలిటీ చార్జర్ వాడితే మొబైల్‌కే నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే తప్పనిసరిగా మంచి నాణ్యమైన చార్జర్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైన చార్జర్ కొంచెం ఖరీదైనదే అయినా, దాన్ని సరిగ్గా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చార్జర్ పాడైపోయిందని అనిపించిన వెంటనే కొత్తదాన్ని కొనడం మంచిది.

ముఖ్యంగా చార్జర్‌ను సాకెట్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేసి వదిలేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు కేబుల్ నోట్లో పెట్టుకోవడం వల్ల విద్యుత్ షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి, చార్జర్ వాడిన తర్వాత తప్పనిసరిగా తీసేయాలి. 


Post a Comment (0)
Previous Post Next Post