Varun Tej Lavanya Parenthood: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. 2025 సెప్టెంబర్ 10న లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ శుభవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్‌ను వదిలి నేరుగా ఆసుపత్రికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ విషెస్ చెబుతున్నారు.
![]() |
Varun Tej Lavanya Tripathi |
‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌తో కలిసి ‘‘మిస్టర్’’, ‘‘అంతరిక్షం’’ చిత్రాల్లో నటించింది. ఆ సమయంలో ప్రారంభమైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2023 నవంబర్ 1న ఇటలీలో ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే చేతులు పట్టుకుని ఉన్న ఫోటోతో పాటు రెండు చిన్న తెల్లని బూట్ల ఫోటోను షేర్ చేస్తూ “త్వరలో జీవితంలో అద్భుతమైన పాత్రలోకి అడుగుపెడుతున్నాం” అని వెల్లడించారు.
Also Read: పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ!
![]() |
Varun Tej Lavanya Parenthood |
ప్రస్తుతం మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండగా, చిరంజీవి, రామ్ చరణ్ సహా హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంతలో ఈ గుడ్ న్యూస్ రావడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “చిరు, పవన్ మళ్లీ తాతలయ్యారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
![]() |
Varun Tej, Lavanya Tripathi and Family |
ప్రస్తుతం వరుణ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఉండగా, లావణ్య నటించిన తాజా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా బిజీగా ఉంది. నాగబాబు ఇటీవలే ఎమ్మెల్సీగా ఎంపికై, త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read: రెండో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS