Morning Habits: ఉదయం లేవగానే మన మనసు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు మనం చేసే చిన్న పనులు… రోజంతా మన మూడ్, ఆలోచనలు, పనితీరు అన్నీ ప్రభావితం చేస్తాయి. అలా ప్రతి రోజు మంచి ప్రారంభం కావాలంటే… మనం కొన్ని పనులను తప్పించుకోవాలి. అదేంటి అంటే… ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్ర తర్వాత ప్రశాంత ఉదయం ఎందుకు ముఖ్యం?
కంటినిండా నిద్రపోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 8 గంటల నిద్ర తర్వాత శరీరం నూతన ఉత్సాహంతో నిండిపోతుంది. ఉదయం లేవగానే మనకు లభించే ప్రశాంతత, ఆ రోజంతా మన మూడ్‌ను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రశాంతత నిలబడాలంటే, ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తున్నామన్నదే కీలకం.
2. ఉదయం పాజిటివ్ గా మొదలుపెడితే రోజంతా అలా సాగుతుంది!
మానసిక నిపుణులు చెబుతున్నట్లు.. రోజు ఎలా ఉండాలన్నదాన్ని, ఉదయం మన ఆరంభం నిర్ణయిస్తుంది. ఉదయాన్ని మంచి విషయాలతో మొదలుపెడితే, మన రోజంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే సుప్రభాతం వింటే, లేదా దేవుళ్ల పాటలు వింటే మనసు శాంతిగా ఉంటుంది.
3. నెగెటివ్ ఆరంభం రోజంతా ప్రభావితం చేస్తుంది
అయితే కొంతమంది ఉదయాన్నే న్యూస్ ఛానళ్లలో క్రైమ్ న్యూస్ చూస్తారు, లేదా ఫోన్లో నెగిటివ్ మెసేజెస్ చదువుతారు. ఇలా చేసే వారిలో రోజంతా నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తీరుతో ఏ పనినీ సక్రమంగా చేయలేరు, మనసు గందరగోళంగా ఉంటుంది.
Also Read: రోజూ యోగా చేస్తే ఈ 6 సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు
4. ధ్యానం, వ్యాయామం, కుటుంబ సమయం - ఇవే ఆనందానికి మూలాలు
ఉదయాన్నే స్వల్ప వ్యాయామం, ఆ తర్వాత కనీసం 30 నిమిషాలు ధ్యానం చేస్తే మనస్సు కుదుటపడుతుంది. ధ్యానంలో మనకు ఇష్టమైన పదాలు, వ్యక్తుల గురించి తలచుకుంటే మనసులో ఉత్సాహం పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ అయ్యేంతవరకు కుటుంబంతో సరదాగా గడిపితే, ఉదయం మరింత హాయిగా ఉంటుంది.
5. ఉదయం గొడవలు కాదు… గౌరవం ఉండాలి
ఉదయాన్నే ఇంట్లో గొడవలు, చిన్న వివాదాలు జరిగితే ఆ రోజు అంతా ఒత్తిడితో గడుస్తుంది. పిల్లల పట్ల కాస్త నిగ్రహంగా ఉండాలి. వారి మూడ్ పాడైతే వారు పాఠశాలలోనూ సరిగా ఉండలేరు. అందుకే, ఉదయం మనం ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నామన్నదే కుటుంబ ఆనందానికి ఆధారం.
ఒక మంచి రోజు… మనమే క్రియేట్ చేయగలం. ఉదయం లేవగానే మన ఆలోచనలు, మన చర్యలు, మన శ్రద్ధ.. ఇవే మన ఆత్మశక్తికి బలం ఇస్తాయి. రోజును పాజిటివ్‌గా ప్రారంభించండి… అది జీవితాన్ని మెల్లగా మార్చే మార్గం అవుతుంది.
Also Read: అష్టదిక్పాలకులు అంటే ఎవరు?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS