Dopamine Boosting Habits: సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన హ్యాపీ ట్రిక్స్.. ప్రతిరోజూ ట్రై చేయండి!

Dopamine Boosting Habits: సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరికీ ఆనందం కావాలనే కోరిక ఉంటుంది. కానీ సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి అన్నది మనకు స్పష్టంగా తెలుసుకోవాలి. మన శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఉత్తేజం కలుగుతుంది. అదే మనకు సంతోషాన్ని ఇస్తుంది. హ్యాపీ హార్మోన్లు కొన్ని ప్రత్యేకమైన పనుల వలన ఉత్తేజితమవుతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి ఈ పనులు చేస్తే ఖచ్చితంగా సంతోషంగా ఉండవచ్చు.

Dopamine Boosting Habits

వ్యాయామం, ధ్యానం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శారీరకంగా, మానసికంగా సంతృప్తి లభిస్తుంది. అదేవిధంగా ధ్యానం చేయడం వల్ల శాంతి, ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఈ ప్రక్రియలతో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఆనందం కలుగుతుంది.

హైడ్రేటెడ్‌గా ఉండడం: శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. తగినంత నీరు తాగడం వల్ల డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మనలో ఉత్సాహం, సంతోషం పెంచుతుంది. కాబట్టి నీళ్లు తాగడం ఎప్పుడూ మరవకండి.

తగినంత నిద్ర: రోజుకు కనీసం 78 గంటలపాటు నిద్ర అవసరం. నిద్ర సరిపడా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో డోపమైన్ హార్మోన్ సహజంగా ఉత్పత్తి అవుతుంది. దాంతో సంతోషంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి.

సూర్యరశ్మి: విటమిన్ డి కోసం ప్రతిరోజూ తెల్లవారుజామున కొద్దిసేపు సూర్యరశ్మిలో గడపాలి. ఇది శరీరంలో డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది. సూర్యకాంతి లేకపోతే విటమిన్ డి లోపం వస్తుంది. దాంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి సరిపడా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాం.

ఆరోగ్యకరమైన ఆహారం: శరీరానికి అవసరమైన పోషకాలను ఇచ్చే ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. మంచి ఆహారం శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. దాంతో మనం మరింత సంతోషంగా ఉండగలుగుతాం.

Also Read: రోజంతా ఎనర్జీతో ఉండాలంటే ఉదయం ఇలా మొదలుపెట్టండి!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post