Dong Valley: ప్రకృతి ప్రేమికులకు నిజమైన స్వర్గధామంగా నిలిచే అలాంటి ఒక అద్భుత ప్రదేశం ఉంది. ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనల్ని ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి భారతదేశంలోని ఈ ప్రత్యేక గ్రామం. ఇక్కడే దేశంలో తొలి సూర్యోదయాన్ని చూడవచ్చు. ఉదయం మొదటగా సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు. ఆసక్తికరంగా మధ్యాహ్నం వరకు అస్తమించి రాత్రి మొదలవుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా, విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తారు.
![]() |
Dong Valley |
భారతదేశంలో అనేక ప్రాంతాలు వాటి ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందాయి. అయితే సూర్యుడు దేశంలో ముందుగా ఎక్కడ ఉదయిస్తాడో చాలామందికి తెలియదు. ఈశాన్య భారతదేశంలో అలాంటి ఒక గ్రామం ఉంది. అదే అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ గ్రామం. భారతదేశం, చైనా, మయన్మార్‌ల త్రి-జంక్షన్ సమీపంలో ఈ గ్రామం ఉంది. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఈ ప్రదేశం ప్రత్యేకత కారణంగా పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు చేరుకుంటారు.
డాంగ్ గ్రామంలో సూర్యోదయం సాధారణంగా తెల్లవారుజామున 2 నుండి 3 గంటల మధ్య జరుగుతుంది. ఇది భారతీయ ప్రామాణిక సమయానికి ఒక గంట ముందే కనిపిస్తుంది. ఈ అద్భుత సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
Also Read: శంభల నగరం గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే!
ఇక్కడ సూర్యోదయాన్ని చూడటానికి రాత్రిపూట దట్టమైన అడవులు, నిటారుగా ఉన్న కొండల గుండా సుమారు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. రహదారులు పరిమితంగా ఉండటంతో పాటు ప్రాథమిక సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, ఇది ప్రకృతి ప్రేమికులకు నిజమైన గమ్యస్థానంగా మారుతుంది.
డాంగ్‌లో సూర్యుడు త్వరగా ఉదయించినట్లే, త్వరగా అస్తమిస్తాడు కూడా. సాధారణంగా మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య సూర్యాస్తమయం జరుగుతుంది. దీని ప్రభావం అక్కడి ప్రజల జీవనశైలిపై పెద్దగా ఉండదు. వారు ఉదయం పనులు ముగించుకుని, మధ్యాహ్నం నుంచే రాత్రి కోసం వంట మొదలు పెడతారు. ఈ ప్రాంతంలో మిష్మి తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరి జీవనశైలి ప్రకృతితో ముడిపడి ఉంటుంది. వారి పండుగలు, ఆచారాలు, రోజువారీ కార్యక్రమాలన్నీ సూర్యోదయం, సూర్యాస్తమయంపై ఆధారపడి ఉంటాయి. ఇది మానవ జీవనం సహజ వాతావరణానికి ఎలా అనుసంధానమవుతుందో చూపిస్తుంది.
డాంగ్ చేరుకోవడానికి భారతీయ పర్యాటకులకు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. విదేశీ పర్యాటకులు రక్షిత ప్రాంత పర్మిట్ తీసుకోవాలి. గ్రామం భారత-చైనా సరిహద్దు దగ్గరగా ఉన్నందున, సైనిక స్థావరాలు ఎక్కువగా ఉంటాయి. సాహసాన్ని, ప్రకృతిని ఇష్టపడే వారికి ఇది అద్భుత ప్రదేశం. ఇక్కడ సూర్యోదయాన్ని ఆస్వాదించడమే కాకుండా, ట్రెక్కింగ్ చేయవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ, మిష్మి తెగ సంస్కృతి, వారసత్వం గురించి తెలుసుకోవచ్చు.
సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ చిన్న గ్రామం పర్యాటకులకు, ఫోటోగ్రాఫర్లకు అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన జీవనశైలి, ప్రకృతి అందాలు, సాంస్కృతిక విశిష్టతలతో డాంగ్ గ్రామం భారతదేశపు తొలి సూర్యోదయ క్షణాలను మనసులో పదిలం చేస్తుంది. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ మన దేశం ప్రకృతితో ఎంత సమపాళ్లలో కలిసిపోయిందో ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు.