Maruti S-Presso: కొత్త జీఎస్టీ (GST 2.0) వచ్చి ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కార్లు, బైకుల ధరల్లో గణనీయంగా తగ్గుదల చోటు చేసిందని మనకు తెలిసిందే. అయితే ఈ ధరల తారుమారుతో భారతదేశంలో చౌకైన కారు అనిపించిన మారుతి ఆల్టో ఇప్పుడు సెకండ్ చీపెస్ట్ కారుగా మారింది. ప్రస్తుతం చౌకైన కారు మారుతి ఎస్-ప్రెస్సో. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
![]() |
Maruti S-Presso |
జీఎస్టీ మార్పు తర్వాత మారుతి సుజుకి చిన్న కార్ల ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆల్టోతో పోలిస్తే ఎస్-ప్రెస్సో ధర బాగా తగ్గడం వల్ల, ఈ కారు ఇప్పుడు చౌకైన కారుగా మారింది. మారుతి ఎస్-ప్రెస్సో ధర ప్రస్తుతం కేవలం రూ. 3.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఒకప్పుడు అదే ధరకు ఆల్టో లభించేది. అయితే ఇప్పుడు ఆల్టో ధర రూ. 3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే, గత పదేళ్లుగా భారతదేశంలో అత్యంత చౌకైన కారుగా నిలిచిన ఆల్టో ఇప్పుడు ఎస్-ప్రెస్సో కంటే ఖరీదైన కారుగా మారింది.
Also Read: కారు మెయింటెనెన్స్ టిప్స్.. ఫ్యూయెల్ ట్యాంక్ ఫుల్ చేయడం మంచిదేనా?
కారణం: ప్రభుత్వం ఇటీవల కొత్త వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయడం వల్ల ధరల్లో మార్పు వచ్చింది. ఆల్టో కె10 కారు ఈ అప్‌డేట్‌తో వస్తుంది, అందువల్ల దీని ధర మరింత పెరిగింది. కానీ ఎస్-ప్రెస్సో మాత్రం రెండు ఎయిర్‌బ్యాగ్స్‌తో పరిమితం చేయబడింది. అందువల్ల దీని ధర తక్కువగా ఉంది.
ఫీచర్లు: మారుతి ఎస్-ప్రెస్సోలో ఆల్టోలోని కె10 ఇంజిన్ ఉంచబడింది, కానీ డిజైన్ మినీ ఎస్-యూవీ లా ఉంటుంది. ఆల్టోతో పోలిస్తే ఎస్-ప్రెస్సోలోపలి క్యాబిన్ విశాలంగా, కారు సైజు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ 998 సిసి త్రీ-సిలిండర్ ఇంజిన్ ఉంది, 68 బిహెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గియర్‌బాక్స్‌తో వస్తుంది మరియు 25 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది.
సేఫ్టీ ఫీచర్స్‌లో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్, హై-స్పీడ్ వార్నింగ్, సీట్‌బెల్ట్ రిమైండర్, ప్రీ-టెన్షనర్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. అలాగే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: ఎలక్ట్రిక్ బైక్ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు.. లేకపోతే ఇబ్బందులే!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS