Chicken Breast vs Chicken Legs: చికెన్ బ్రెస్ట్ Vs చికెన్ లెగ్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ? ఆరోగ్యానికి ఏది మంచిది?

Chicken Breast vs Chicken Legs: చికెన్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. చాలామందికి అసలు చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. రుచికరంగా ఉండటమే కాకుండా, సహజంగా లభించే ప్రోటీన్ కోసం చికెన్ ఒక అద్భుతమైన ఆహారం. ముఖ్యంగా కండరాలను పెంచుకోవాలనుకునే వారు, బరువు తగ్గాలని కోరుకునే వారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేవారికి చికెన్ ఎంతో ఉపయోగకరం.

Chicken Breast vs Chicken Legs
Chicken Breast vs Chicken Legs

అయితే చికెన్‌లోని ప్రతి భాగం ఒకే రకమైన పోషకాలను కలిగి ఉండదు. ఏ భాగం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

చికెన్‌లో ప్రోటీన్ ఎంత? (100 గ్రాములకి)

  • చికెన్ బ్రెస్ట్: 31 గ్రాముల ప్రోటీన్, 3.6 గ్రాముల కొవ్వు, 165 కేలరీలు
  • చికెన్ లెగ్స్: 26 గ్రాముల ప్రోటీన్, 10.9 గ్రాముల కొవ్వు, 209 కేలరీలు
  • చికెన్ వింగ్స్: 30.5 గ్రాముల ప్రోటీన్, 8.1 గ్రాముల కొవ్వు, 290 కేలరీలు
  • చికెన్ డ్రమ్ స్టిక్స్: 28 గ్రాముల ప్రోటీన్, 5.7 గ్రాముల కొవ్వు, 175 కేలరీలు

Also Read:  గుడ్డు vs పనీర్ vs చికెన్.. దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంది?

Chicken Breast
Chicken Breast
మీ లక్ష్యం ప్రకారం ఎంచుకోవాలి

  • బరువు తగ్గాలనుకునే వారికి: చికెన్ బ్రెస్ట్ ఉత్తమమైనది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండి, కొవ్వు మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి.
  • జిమ్ చేసే వారికి లేదా బరువు పెరగాలనుకునే వారికి: చికెన్ థైస్, వింగ్స్, డ్రమ్ స్టిక్స్ మంచివి. వీటిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటంతో కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.

Also Read: వర్షాకాలంలో ఆరోగ్యం కాపాడే బెస్ట్ సూపర్ ఫుడ్స్!

Chicken Legs
Chicken Legs
వంట విధానం కూడా ముఖ్యం

  • ఉడకబెట్టడం - అదనపు కొవ్వు లేకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • రోస్టింగ్ లేదా గ్రిల్లింగ్ - రుచి పెరగడం, అదనపు కొవ్వు తగ్గడం.
  • వేయించడం - అధిక కేలరీలు చేరడం, శరీరంలో కొవ్వు పెరగడం.

చికెన్ ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక కీలక భాగం. కానీ ఏ ముక్క తింటున్నామన్నది, దాన్ని ఎలా వండుకున్నామన్నది ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. బరువు తగ్గడమా, లేక కండరాలు పెంచుకోవడమా అనే దాన్ని బట్టి చికెన్ భాగాన్ని ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.

Also Read: బిర్యానీ తినడం వలన కలిగే దుష్ప్రభావాలు.. జాగ్రత్తగా ఉండండి!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post