UPSC Recruitment 2025: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, మొత్తం 213 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, అడిషనల్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్, డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్ తదితర పోస్టులు ఉన్నాయి.
![]() |
UPSC Recruitment 2025 |
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా: ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2025 నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
- అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్ - 05
- అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ - 16
- అడిషనల్ లీగల్ అడ్వైజర్ - 02
- అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్ - 01
- డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్ - 02
- డిప్యూటీ లీగల్ అడ్వైజర్ - 12
- లెక్చరర్(ఉర్దూ) - 15
- మెడికల్ ఆఫీసర్ - 125
- అకౌంట్స్ ఆఫీసర్ - 32
- అసిస్టెంట్ డైరెక్టర్ - 03
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిగ్రీ(లా), పీజీ(ఉర్దూ), బీఈడీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతేకాకుండా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి.
Also Read: విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు!
వయో పరిమితి:
- జనరల్ - 50 ఏళ్లు
- OBC - 53 ఏళ్లు
- SC/ST - 55 ఏళ్లు
- PWD - 56 ఏళ్లు
- EWS - 40 ఏళ్లు
దరఖాస్తు చివరి తేదీ:
అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 2, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులు - రూ. 25
- SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు - ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ: ఈ నియామకంలో రాత పరీక్ష లేదు. విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఇతర వివరాలు UPSC నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
Also Read: తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉచిత విద్య అందించే దేశాలు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS