Mokshagundam Visvesvaraya: ఇంజినీరింగ్‌లో మేధావిగా, పాలనలో దూరదృష్టి కలిగిన నాయకుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అపార కీర్తిని సంపాదించారు. సుమారు 30 సంవత్సరాలపాటు ఇంజినీరింగ్ రంగంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు. ఆయన మార్గదర్శకత్వంలో నిర్మించబడిన కట్టడాలు నేటికీ స్థిరంగా నిలిచి ఉన్నాయంటే అది ఆయన ప్రతిభకు నిదర్శనం. మూసీ వరద నివారణ చర్యలు, విశాఖపట్నం పోర్ట్ నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులు ఆయన ప్రతిభకు నిలువెత్తు ఉదాహరణలు.
 |
Mokshagundam Visvesvaraya |
ఇంజినీరింగ్ ప్రాముఖ్యతలో విశ్వేశ్వరయ్య గారి స్థానం: మానవ నాగరికతలో ఇంజినీరింగ్ కీలక పాత్ర పోషించింది. ఆనకట్టలు, రైల్వే వంతెనలు, రహదారులు, సొరంగాలు వంటి ఎన్నో కట్టడాలు ఇంజినీర్ల ప్రతిభ ఫలితం. అలాంటి వారిలో భారతదేశం గర్వించదగ్గ పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సృష్టించిన నిర్మాణాలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి. అందుకే ఆయన జయంతి సెప్టెంబరు 15న ప్రతి సంవత్సరం "ఇంజినీర్స్ డే"గా జరుపుకుంటారు.
బాల్యం, విద్య: 1861 సెప్టెంబరు 15న చిక్కబళ్లాపూర్ సమీపంలోని ముద్దెనహళ్ళిలో జన్మించిన విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. కానీ 12 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. బెంగళూరులో హైస్కూల్ పూర్తిచేసి, 1881లో డిగ్రీ సాధించారు. అనంతరం పుణే ఇంజినీరింగ్ కాలేజీలో చేరి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
వృత్తి ప్రస్థానం: బొంబాయిలో కొంతకాలం పనిచేసి, తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో చేరారు. అలా ఆయన ప్రతిభ దేశానికి తెలిసింది. జలాశయాల రూపకల్పనలోనూ, ఆర్థిక ప్రణాళికలలోనూ విశేష కీర్తి పొందారు. 1912–1918 మధ్య మైసూర్ దివాన్‌గా పనిచేసి, మైసూర్‌ను ఆదర్శనగరంగా తీర్చిదిద్దారు. కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం ఆయన ముఖ్య కృషి. హైదరాబాద్, ముంబయి నగరాలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటు ఇవన్నీ ఆయన ప్రతిభ ఫలితాలు.
హైదరాబాద్ వరద నియంత్రణలో పాత్ర: 1900ల్లో మూసీ వరదలతో హైదరాబాద్ నగరం నాశనం కావడాన్ని నివారించడానికి నిజాం నవాబు విశ్వేశ్వరయ్య గారిని సంప్రదించారు. ఆయన సూచనల ప్రకారం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు నిర్మించబడ్డాయి. ఇవే నేటికీ నగరానికి నీటి అవసరాలను తీర్చుతున్నాయి. అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థ రూపకల్పన కూడా ఆయనదే.
విశాఖపట్నం పోర్ట్ రక్షణ: విశాఖ రేవు నిర్మాణ సమయంలో అలల ప్రభావం తీవ్రంగా ఉండేది. అలల ప్రభావాన్ని తగ్గించడానికి ఆయన రెండు పాత నౌకల్లో బండరాళ్లు వేసి సముద్రతీరంలో ముంచాలని సూచించారు. దీని ఫలితంగా పోర్ట్ రక్షితమై, తర్వాత కాంక్రీట్ బ్రేక్ వాటర్స్ నిర్మించబడ్డాయి.
ఇతర కృషులు