SBI SO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 02గా నిర్ణయించారు.
![]() |
SBI SO Recruitment 2025 |
ఖాళీల సంఖ్య
మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) 63, మేనేజర్ (ప్రోడక్ట్ - డిజిటల్ ప్లాట్‌ఫామ్స్) 34, డిప్యూటీ మేనేజర్ (ప్రోడక్ట్ - డిజిటల్ ప్లాట్‌ఫామ్స్) 25 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
ప్రతి పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు MBA/PGDBA/PGDBM/MMS లేదా CA/CFA/ICWA అర్హతలు ఉండాలి. బీటెక్, బీఈ లేదా ఎంసీఏ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి
అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
Also Read: విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు!
అప్లికేషన్ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభమయ్యాయి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 02.
ఫీజు వివరాలు
జనరల్, EWS, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ₹750. SC, ST మరియు PwBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం
అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలు
పూర్తి వివరాల కోసం SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.bank.in/ ను సందర్శించండి.
Also Read: రాత పరీక్ష లేకుండా UPSC ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS