Nehru Foreign Policy Mistakes on Nepal: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నాయి. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనను ముగించడానికి అనేకమంది పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారు. ఉరి కొయ్యలను ముద్దాడుతూ స్వేచ్ఛను సాధించారు. స్వతంత్ర భారతం ఆక్సిజన్ పీలుస్తున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు అంగీకరించింది. ప్రత్యేక దేశం కావాలన్న పాకిస్తాన్‌ను వేరుచేసింది. ఇప్పుడు అదే దేశం మన శత్రువుగా మారింది. ఇదే కాంగ్రెస్.. ఒకప్పుడు భారత్‌లో విలీనం కావాలని కోరిన నేపాల్ ప్రతిపాదనను తిరస్కరించింది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ తీసుకున్న ఈ రెండు ప్రధాన నిర్ణయాలు ఇప్పటికీ భారత భూభాగం, భద్రతపై ప్రభావం చూపుతున్నాయి.
![]() |
Nehru Vs India Gandhi |
రానా పాలన నుంచి విలీన ప్రతిపాదన వరకు: 1940ల చివరినాటికి నేపాల్‌లో రానా కుటుంబం పాలన కొనసాగుతోంది. రాజు త్రిభువన్ షా భారత్‌లో ప్రవాసంలో ఉన్న సమయంలో, 1950లో రానాలను గద్దె దించి తిరిగి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో చైనా కమ్యూనిస్టు విప్లవం, టిబెట్‌పై ఆక్రమణ వంటి భద్రతా సవాళ్లు ఉద్భవించాయి. దీంతో రాజు త్రిభువన్ నెహ్రూకు నేపాల్‌ను భారత ప్రావిన్స్‌గా విలీనం చేయాలని ప్రతిపాదించారు. ముఖర్జీ రచన ప్రకారం, ఈ సూచన 1950లో ఇండో-నేపాల్ శాంతి, స్నేహ ఒప్పందం సందర్భంలో వచ్చింది. ఆ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలను బలపరిచింది.
Also Read: రెండు వరుస గ్రహణాలు.. నేపాల్ నుంచి ఫ్రాన్స్ వరకు రాజకీయ కల్లోలం!
నెహ్రూ తిరస్కరించిన కారణం: నెహ్రూ ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆయన దృష్టిలో నేపాల్ స్వతంత్ర దేశంగా ఉండాలి. ‘నాన్-అలైన్‌మెంట్’ విధానాన్ని అనుసరించిన నెహ్రూ, చైనాతో సంబంధాలు చెడిపోకుండా చూడాలని భావించారు. నేపాల్ విలీనం జరిగితే చైనా తీవ్రంగా స్పందించి భారత్‌పై ఒత్తిడి తెస్తుందనే భయం కలిగింది. అదనంగా, గోవా విలీనం (1961)లాంటి చర్యలపై యూరప్ విమర్శలు ఎదుర్కొన్నందున, నేపాల్‌ను కలపడం అంతర్జాతీయ వ్యతిరేకతకు దారి తీస్తుందని భావించారు. ఆ కాలంలో పాకిస్తాన్ విభజన తర్వాత (1947), భారత్‌లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. నేపాల్ విలీనం జాతీయవాదులు మద్దతు పొందినా, కాంగ్రెస్‌లోని సెక్యులర్ విభాగాలు వ్యతిరేకించాయి. ఇది బ్రిటిష్, అమెరికన్ జోక్యాన్ని ప్రేరేపించింది.
![]() |
Nehru Foreign Policy Mistakes on Nepal |