Gautam Buddha Life Lessons: ఒక మనిషి జీవితాన్ని నడిపించేది మెదడు. మెదడులో వచ్చే ఆలోచనలు, ఆ వ్యక్తి జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సుఖమయం అవుతుంది. కానీ మనసు ఆందోళనతో నిండిపోతే, జీవితం సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుంటుంది. అయితే వాటిని తలుచుకుంటూ బాధపడితే సమస్యలు తగ్గవు. ఒక్కొక్కదాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడమే జీవన విధానం. కానీ ఈ చిన్న విషయాన్ని చాలా మంది విస్మరిస్తారు. “తమకు ఏదో జరగబోతుంది” అనే భయం, “భవిష్యత్తులో ఏదో సమస్య వస్తుంది” అనే ఆందోళనతో జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. కొందరిని ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే, “జీవితం సంతోషంగా లేదు, ఎప్పుడూ కష్టాలే ఉన్నాయి” అని చెబుతారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి సంతోషం వారి మనసులోనే ఉంటుంది.
![]() |
Gautam Buddha |
గౌతమ బుద్ధుడు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించేవాడు. ఆయన అనేక సమస్యలకు పరిష్కారం చూపాడు. ఆయన బోధనలలో ముఖ్యమైనది - మనిషి ఆనందం తనలోనే ఉంటుంది. దాన్ని ఎవరు తీసుకోలేరు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించాలని కష్టపడుతుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి సంపాదిస్తాడు. కానీ మరోవైపు డబ్బును అతి ఖర్చు చేస్తూ ఉంటాడు. అందువల్ల చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండదు. చివరికి “ఎంత కష్టపడినా డబ్బు లేదు” అని బాధపడతాడు. అసలు సమస్య డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని పొదుపు చేయడంలో ఉంది. కొంతమంది కోరికలను నియంత్రించుకోవడం కూడా నేర్చుకోవాలి. అలా చేస్తే జీవితాంతం సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.
భార్యాభర్తల విషయంలో కూడా ఇదే నిజం. ఎక్కువ శాతం మహిళలు తమ కుటుంబంపై ఎక్కువగా ఆలోచిస్తారు. భర్త పని కారణంగా కొద్దిసేపు పట్టించుకోకపోతే, “భవిష్యత్తులో ఏదో అవుతుందేమో” అనే నెగటివ్ ఆలోచనలతో బాధపడతారు. దాంతో మనసు ఆందోళనకు లోనై, చివరికి గొడవలకు దారితీస్తుంది. కానీ ఆ గొడవ ఎందుకు మొదలైందో కూడా తెలియని స్థితి వస్తుంది. ఈ పరిస్థితిని తప్పించుకోవాలంటే, నెగటివ్ ఆలోచనలకు లొంగకుండా, ప్రశాంతంగా ఆలోచించడం చాలా అవసరం. అలా చేస్తే ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
వ్యాపారంలోనూ ఇదే వర్తిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు ముందుగా “లాభమా నష్టమా” అనేది ఆలోచించాలి. కానీ “ఎన్ని నష్టాలు వస్తాయో” అని ముందే భయపడితే, ఎప్పటికీ ఆరంభించలేరు. వ్యాపారంలో సమస్యలు తలెత్తినప్పుడు సహనంతో ఉంటే, పరిస్థితి కొద్దిరోజుల్లో అర్థమవుతుంది. కానీ ప్రతీ సమస్యకీ ఆందోళన చెందితే మనసు ఎప్పుడూ కలతతో నిండిపోతుంది.
ఇలా అనవసర ఆలోచనలతో బాధపడడం జీవితాన్ని భారంగా మార్చేస్తుంది. కానీ సమస్యను తలుచుకోవడం కాకుండా, దానికి పరిష్కారం ఎలా కనుగొనాలి అనే దానిపై దృష్టి పెడితే, ఒత్తిడి ఉండదు. అంతేకాకుండా, అనవసర పనుల నుంచి దూరంగా ఉంటే, మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండి, జీవితం నిజమైన సంతోషాన్ని అందిస్తుంది.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS