Smriti Mandhana Wedding Postponed: స్మృతి మందాన వివాహం వాయిదా.. అసలు కారణం ఇదే

Smriti Mandhana Wedding Postponed: స్మృతి మందాన భారత మహిళా క్రికెట్ జట్టులో అత్యంత ముఖ్యమైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. ఇటీవల టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో ఆమె తన వంతు పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన స్మృతి, ఫీల్డింగ్‌లో పాదరసం లాగా చురుకుగా కదిలి అందరినీ ఆకట్టుకుంది. మహిళా ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టును విజేతగా నిలిపిన నాయకుల్లో ఆమె ఒకరు.

Smriti Mandhana Wedding Postponed
Smriti Mandhana Wedding Postponed

స్మృతి అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు, మైదానంలో చలాకీగా, అలర్ట్‌గా ఉంటూ తన చుట్టూ వాతావరణాన్ని సందడిగా మార్చేస్తుంది. ఇటువంటి స్మృతి కొంతకాలంగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ప్రేమలో ఉంది. తమ బంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలని నిర్ణయించిన ఈ జంట ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ అనంతరం ఆదివారం సాంగ్లీలో వారి వివాహం జరగాల్సి ఉండగా, ఊహించని పరిణామం ఆ వేడుకను నిలిపివేసింది.

Also Read: స్మృతి మంధాన-పలాష్ ముచ్చల్ నిశ్చితార్థం.. వైరల్‌గా మారిన ప్రేమ క్షణాలు!

స్మృతి తండ్రి శ్రీనివాస్ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. పరిస్థితి గురించి కొన్ని గంటలు గడిస్తే గానీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. దాంతో వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకున్న తర్వాతనే కొత్త తేదీ ప్రకటిస్తామని కుటుంబం స్పష్టం చేసింది.

మేనేజర్ తుహిన్ మిశ్రా స్పందన
స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాకు ఇచ్చిన ప్రకటనలో, “స్మృతి తండ్రి ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనను ICUలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే పెళ్లి తేదీని ప్రకటిస్తాం. ఈ నిర్ణయం తీసుకోవడం క్లిష్టమే అయినప్పటికీ, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది” అని తెలిపారు.

Also Read: అక్కినేని అమల చెప్పిన అరుదైన వ్యక్తిగత విషయాలు!

Post a Comment (0)
Previous Post Next Post