Economic Growth Habits: ధనవంతులు కావాలంటే వెంటనే మార్చాల్సిన నాలుగు అలవాట్లు!

Economic Growth Habits: ప్రస్తుత కాలంలో మన సమాజం మొత్తం డబ్బు ఆధారంగా నడుస్తోంది. డబ్బు లేకపోతే జీవితం శూన్యంగా అనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి ఒక్కరికీ సంపాదన అవసరమే కాదు, దనవంతులు కావాలనే కోరిక కూడా ఉంటుంది. దీనిని సాధించడానికి కష్టపడి పనిచేయడం మాత్రమే కాకుండా, మనలో ఉన్న కొన్ని అలవాట్లను మార్చుకోవడం కూడా అత్యంత ముఖ్యము. ఎందుకంటే మన లక్షణాలు, మన ఆలోచనా విధానం మరియు ప్రతిరోజూ అనుసరించే అలవాట్లు మన ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవచ్చు. పెద్దలు చెడ్డవారితో సహవాసం వద్దని చెప్పినట్లే, కొన్ని అలవాట్లు మనలను జీవితాంతం పేదరికంలోనే ఉంచగలవని చాణక్యుడు హెచ్చరించాడు. కాబట్టి ఇవి ఏవో తెలుసుకొని, సంపద సృష్టివైపు ముందడుగు వేయాలి.

Economic Growth Habits
Economic Growth Habits
1. అనవసర ఖర్చుల అలవాటు
అవసరం లేని విషయాలపై డబ్బు ఖర్చు చేయడం ఒక వ్యక్తిని ఎంత సంపాదించినా పేదవాడిగానే ఉంచుతుంది. ఆదాయం వచ్చిన వెంటనే అవసరం లేని ఖర్చులు పెడితే, ఎప్పుడూ జేబు ఖాళీగానే ఉంటుంది. చాణక్యుని ప్రకారం, ప్రతి వ్యక్తి తన ఆదాయంలో ఒక భాగాన్ని భవిష్యత్తు కోసం తప్పనిసరిగా పొదుపు చేయాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో క్రమశిక్షణ ఉంటేనే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అవసరమైన వాటికే ఖర్చు చేసే అలవాటు సంపదను కూడబెట్టుకోవడంలో సహాయపడుతుంది.

Also Read: పెళ్లికి ముందు అమ్మాయి-అబ్బాయి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు!

2. అనవసరంగా అప్పులు తీసుకోవడం
ఎవరినీ అవసరం లేకుండా అప్పు తీసుకోవడం చాణక్య నీతి ప్రకారం అత్యంత హానికరం. తరచూ అప్పులు తీసుకునే వ్యక్తి చివరకు అప్పులపాలై పేదరికంలో చిక్కుకుంటాడు. సంపాదించిన మొత్తం ఆదాయం అప్పులు తీర్చడానికే ఖర్చయిపోతుంది. ఈ అలవాటు నుంచే బయటపడకపోతే ఆర్థికంగా ఎదగడం అసాధ్యం. కాబట్టి అవసరం ఉన్నప్పుడు మాత్రమే, స్పష్టమైన ప్లాన్‌తో మాత్రమే అప్పు తీసుకోవాలని చాణక్యుడు సూచించాడు.

3. తిండిపోతు స్వభావం
ఎల్లప్పుడూ తినడంపైనే దృష్టి పెట్టే వ్యక్తి తన సంపాదనలో పెద్ద భాగాన్ని ఆహారంపైనే ఖర్చు చేస్తాడు. దీనితో సంపదను కూడబెట్టడం కష్టతరం అవుతుంది. ప్రతి విషయానికి మితి అవసరం; ఆహారంపైనా అదే వర్తిస్తుంది. తిండిపోతు స్వభావం నియంత్రణ లేకుండా సాగితే, డబ్బు వచ్చినా పోతూనే ఉంటుంది. చాణక్యుడు దీన్ని ఆర్థిక ఎదుగుదలను అడ్డుకునే అలవాట్లలో ఒకటిగా పేర్కొన్నాడు.

4. సోమరితనం
సోమరితనం ఉన్న వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేడు. శ్రమ లేకుండా సంపద రాదు. ఆలస్యం, నిర్లక్ష్యం, పని వాయిదా వేయడం ఇవి అన్నీ వ్యక్తిని పేదరికంలోనే ఉంచే లక్షణాలు. ఆర్థిక విజయాన్ని అందుకోవాలంటే సోమరితనాన్ని దూరం చేసి, లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. చాణక్యుడు సోమరితనం మనిషిని అన్నివిధాలా వెనక్కు నెడుతుందని స్పష్టంగా చెప్పాడు.


Post a Comment (0)
Previous Post Next Post