Kurma Village Story: కరెంటు, మొబైల్, ఇంటర్నెట్ లేకుండా జీవిస్తున్న అరుదైన గ్రామం కథ!

Kurma Village Story: గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలని పలువురు మేధావులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. గ్రామాల్లో అభివృద్ధి జరిగితే దేశం బాగుపడుతుందని అనేక మంది పేర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనేక గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. పట్టణాల్లో, నగరాల్లో ఉండే జీవన విధానం గ్రామాల్లో కూడా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల్లో సైతం ఇంటర్నెట్, అత్యాధునిక సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. అయితే, ఈ మార్పుల మధ్య ఓ ప్రత్యేక గ్రామం మాత్రం పూర్వకాలపు పద్ధతులనే పాటిస్తూ జీవిస్తోంది. కరెంటు లేకుండా, ఇంటర్నెట్ వినియోగం లేకుండా, డిజిటల్ లావాదేవీలు చేయకుండా సహజ పద్ధతుల్లో జీవనం కొనసాగిస్తున్న ఈ గ్రామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Kurma Village Story
Kurma Village Story

ఆధునికతకు దూరంగా నిలిచిన కూర్మా గ్రామం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కూర్మా గ్రామం ఆధునికతకు వ్యతిరేకంగా ఉండి ప్రపంచానికి దూరంగా ప్రశాంత జీవనం గడుపుతోంది. ఇక్కడి ప్రజలు పూర్తిగా సహజసిద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తారు. పూర్వకాల సాంప్రదాయాలను పాటిస్తూ సహజ ఆరోగ్యపద్ధతులు అవలంబిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ గ్రామంలో కరెంటు లేదు. సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటిలో చిన్న హారతి ఇచ్చి నిద్రిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజలు ముగించుకుని తమ పనులు ప్రారంభిస్తారు.

వీరు కరెంటు వాడకపోవడానికి వెనుక ఉన్న కారణం విశేషమైనది. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కరెంటుతో జీవనం సాగించడం వల్ల మానవ ఆలోచనల్లో మార్పులు వస్తాయని, కొందరిలో నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయని వారు నమ్ముతారు. అందుకే సహజ కాంతిలోనే జీవనం కొనసాగించడం మంచిదని భావిస్తారు.

Also Read: ఎందుకు పెద్దలు “లేవగానే చేతిని చూడు” అంటారో తెలుసా?

Kurma Village
Kurma Village

మొబైల్, టెక్నాలజీకి దూరంగా జీవితం
ఈ గ్రామంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పూర్తిగా నిషేధం. ఎవరి ఇళ్లలోనూ మొబైల్ ఫోన్లు లేవు. మొబైల్ వాడకం వల్ల మానసిక సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లల్లో దాని ప్రభావం తీవ్రమైందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. అందుకే వారు టెక్నాలజీకి దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నారు.

సహజ వ్యవసాయం, వస్తు మార్పిడి విధానం
ఇక్కడి ప్రజలు పూర్తిగా స్వావలంబన జీవనాన్ని గడుపుతున్నారు. తమ అవసరాలకు కావలసిన కూరగాయలు, ధాన్యాలను స్వయంగా పండించుకుంటారు. మార్కెట్‌కి వెళ్లి ఏ వస్తువూ కొనరు. ఒకరికి అవసరం ఉన్నది మరొకరికి ఇస్తూ వస్తు మార్పిడి విధానంలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం లేవగానే శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చి తమ పనుల్లో నిమగ్నమవుతారు. పిల్లలకు పాతకాల బోధనలు చెప్పి, ఆధునికతకు వ్యతిరేకంగా మానసికంగా సిద్ధం చేస్తారు.

Kurmagram Vedic Village
Kurmagram Vedic Village

ఆరోగ్యకరమైన సహజ జీవనం
ఈ గ్రామ ప్రజల నమ్మకం ప్రకారం, సహజ వాతావరణంలో జీవించడం వల్ల దీర్ఘాయుష్షు లభిస్తుంది. పచ్చని కొండల మధ్య స్వచ్ఛమైన గాలి, నీటితో జీవించడం వల్ల రోగాలు దూరమవుతాయని వారు విశ్వసిస్తున్నారు. అనేక మంది ఈ గ్రామ వాతావరణాన్ని అనుభవించడానికి వచ్చి, అక్కడ కొద్ది రోజులు గడిపి తిరిగి శాశ్వతంగా అక్కడే ఉండిపోయినవారూ ఉన్నారు.

సహజ జీవనానికి స్ఫూర్తిగా కూర్మా గ్రామం
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, నగర జీవన రద్దీ వల్ల జీవితం కలుషితమైపోయింది. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఈ కూర్మా గ్రామం మాత్రం సహజసిద్ధమైన జీవనానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మనిషి నిజమైన సంతోషం ఆధునిక పరికరాల్లో కాదు, ప్రకృతితో కలసి జీవించడంలోనే ఉందని ఈ గ్రామం మనకు గుర్తుచేస్తోంది.


Post a Comment (0)
Previous Post Next Post