Kajol: ఏ పని చేయకుండానే లక్షల్లో ఆదాయం… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ సీక్రెట్ ఏమిటి?

Kajol: ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిన బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్… ఇప్పటికి సినిమాలు తగ్గించినా, ఆమె ఆదాయం మాత్రం తగ్గలేదు. ఏ పని చేయకుండానే ఆమె బ్యాంక్ అకౌంట్‌లో ప్రతి నెలా లక్షల రూపాయలు ఆటోమేటిక్‌గా జమ అవుతూనే ఉన్నాయి. ఈ భారీ ఆదాయం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది ఎలా సాధ్యం? ఈ భారీ క్యాష్‌ఫ్లో వెనుక ఉన్న కథ ఏమిటి? అనే విషయాలు ఈ బ్లాగ్ లో వివరంగా తెలుసుకుందాం

Kajol
Kajol

అత్యధిక రెంట్ వచ్చే కమర్షియల్ ప్రాపర్టీ

కాజోల్ ముంబయిలో అత్యంత ప్రైమ్ లొకేషన్‌లో భారీ కమర్షియల్ ప్రాపర్టీకి యజమాని. ఆ ప్రాపర్టీలోని రిటైల్ స్పేస్‌ను దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC‌కు లీజ్‌ కి ఇచ్చింది. అధికారిక ఒప్పందం ప్రకారం, 9 ఏళ్లలో మొత్తం 8.6 కోట్లు, అంటే నెలకు సగటున సుమారు 6.9 లక్షల రూపాయలు కాజోల్‌కు రెంట్‌గా వస్తాయి.

ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమెకు ఆఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు, షూటింగ్‌లు చేయాల్సిన అవసరం లేదు, కెమెరా ముందు నిలబడాల్సిన అవసరమూ లేదు. ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ, బ్యాంక్ నుండి వచ్చే క్రెడిట్ SMS‌లు చూస్తూ… ఆదాయం వచ్చేస్తూనే ఉంటుంది.

Also Read: AR రెహమాన్ కు ‘పెద్ది’ టర్నింగ్ పాయింట్ అవుతుందా?

ఈ భారీ సంపద ఎలా వచ్చింది?
కాజోల్ తన నటనా జీవితంలో పొందిన భారీ పారితోషికం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి వచ్చిన ఆదాయం వంటివి తెలివిగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టింది. ఒక్క ఈ ప్రాపర్టీ మాత్రమే కాకుండా, ఆమె పేరుతో ముంబయిలో మరెన్నో ఆస్తులు ఉన్నాయని, వాటి నుంచి కూడా కోట్లలో రెంట్ వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నటిగానే కాదు… స్మార్ట్ ఇన్వెస్టర్‌గా కూడా కాజోల్
‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి ఐకానిక్ సినిమాలతో దేశమంతా అభిమానులను సంపాదించిన కాజోల్… ఒకప్పుడు షారుఖ్ ఖాన్‌తో బెస్ట్ ఆన్‌స్క్రీన్ జోడీగా బాలీవుడ్‌ను షేక్ చేసింది. ఆ సక్సెస్‌ను స్మార్ట్‌గా ఉపయోగించుకుంటూ, నటిగానే కాదు, స్మార్ట్ ఇన్వెస్టర్‌గా కూడా ఎదగడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యింది. అందుకే “Hard Work ఎప్పుడూ మొదట. అయితే విజయం నిలబెట్టేది Smart Work” అని అంటారు కదా. కాజోల్ కూడా అదే రూల్‌ను ఫాలో అవుతూ… ఒకప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పుడు తెలివిగా పెట్టుబడి పెట్టి, జీవితాంతం ఆర్థిక భద్రతను సొంతం చేసుకుంది.

సినిమాలు తగ్గించినా, కెరీర్ స్లో అయినా… కాజోల్ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు రియల్ ఎస్టేట్ క్వీన్. నెలకు లక్షల్లో వచ్చే పాసివ్ ఇన్‌కమ్‌తో ఆర్థికంగా మరింత బలపడుతోంది. ఇక బాలీవుడ్ అందాల రాణి కాజోల్… ఇప్పుడు స్మార్ట్ మనీ మూవ్‌లు చేసే రియల్ ఎస్టేట్ రాణిగా మారింది.


Post a Comment (0)
Previous Post Next Post