Midnight Birthday Celebration: పుట్టినరోజును అర్ధరాత్రి జరుపుకోవడం మంచిదేనా?

Midnight Birthday Celebration: ఈరోజుల్లో పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్‌ చేయడం చాలా సర్వ సాధారణం. ముఖ్యంగా యువత స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 12 గంటలకే వేడుకలు ప్రారంభించేస్తున్నారు. కానీ జ్యోతిష్యం, శాస్త్ర పరంగా చూసుకుంటే ఈ అలవాటు అంత శుభదాయకమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వివరంగా చూద్దాం.

Midnight Birthday Celebration
Midnight Birthday Celebration

మనలో చాలామంది కొత్త రోజు ప్రారంభమయ్యే సరికి పుట్టినరోజును జరుపుకోవడం సెంటిమెంట్‌గా చేసుకుంటారు. స్నేహితుల సర్ప్రైజ్ పార్టీలు, ఫోటోలు, కేక్ కటింగ్ సరదాగా కనిపిస్తాయి. కానీ, జ్యోతిష్యం ప్రకారం రాత్రి 12 నుండి 3 గంటల మధ్య వ్యవధిని ప్రేత కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రకృతి శక్తులలో ప్రతికూల ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. శాంతి శక్తులు తగ్గి, నెగిటివ్ శక్తుల ప్రభావం అధికమవుతుందనే నమ్మకం ఉంది.

జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ప్రకారం, అర్ధరాత్రి 12 గంటల సమయంలో శుభకార్యాలు, మంగళ కార్యక్రమాలు, శుభ ఆరంభాలు చేయడం మంచిది కాదు. ఈ సమయంలో కేక్ కట్ చేయడం కూడా అశుభానికి సంకేతమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

‘దెయ్యం సమయం’లో కేక్ కట్ చేస్తే ఆయుర్దాయం తగ్గుతుందని, అదృష్టం దూరమవుతుందనే నమ్మకం ఉంది. ఇది శాస్త్రీయమా కాదా అనేది వ్యక్తిగత విశ్వాసం, కానీ జ్యోతిష్య పరంగా మాత్రం ఈ నమ్మకం బలంగా ఉంది.

నిపుణుల ప్రకారం, ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్న సమయమందు పుట్టినరోజు వేడుకలు జరపడం అనారోగ్య సమస్యలు రావడానికి దారితీయవచ్చని చెబుతున్నారు. ఈ అభిప్రాయం పూర్తిగా ఆధ్యాత్మిక నమ్మకాలపై ఆధారపడింది.

రాత్రి 12 గంటలను శుభ సందర్భాలకు అనుకూల సమయంగా పరిగణించరు. పుట్టినరోజు వంటి శుభదినాన్ని మంచి సమయాల్లో, శుభప్రభాతంలో లేదా సాయంత్రం సమయంలో జరిపితే శ్రేయస్కరమని పండితుల సూచన.

అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు జరుపుకోవడం ఆధునిక కార్యక్రమాల్లో భాగమే అయినా, జ్యోతిష్య పరంగా ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శుభకార్యాలకు శుభ సమయం అవసరమని వారి అభిప్రాయం. అందుకే… ప్రాతఃకాలం లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో శుభ ముహూర్తంలో పుట్టినరోజు జరుపుకోవడం మరింత శ్రేయస్కరం.


Post a Comment (0)
Previous Post Next Post