Diwali Meaning in Hinduism: దీపావళి అంటే "దీపాల వరుస". ఇది హిందూ, జైన, మరియు సిక్కు మతాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక. నరకాసురుని సంహరించిన సందర్భంగా, ప్రజలు సంబరాలు చేసుకుని, చీకటిని తొలగించడానికి దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకునే సంప్రదాయం కాలక్రమేణా దీపావళిగా మారింది.
![]() |
Diwali meaning in Hinduism |
హిందూ పురాణ గాథల ప్రకారం.. శ్రీరాముడు 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా, రాక్షస రాజు రావణుడిపై విజయం సాధించినందుకు కూడా దీనిని జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగిస్తారు, పూజలు చేస్తారు, కొత్త బట్టలు, నగలతో వేడుకలు చేసుకుంటారు. లక్ష్మీ పూజ చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. అంతేకాకుండా, దీపావళి పండగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.