Afghan MP warns Pak Army: ‘‘మీరు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఒకరోజు మిమ్మల్నే కాటేస్తుంది. ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుని మాపై గురి పెట్టారు. భవిష్యత్తులో మీరు చింతించాల్సిన రోజు వస్తుంది’’ అంటూ ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఎంపీ మరియం సొలైమాంఖిల్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు.
![]() |
Afghan MP warns Pak Army |
ఆఫ్ఘన్ సరిహద్దులో అమానుష దాడులు: ఇటీవల ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాక్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు సహా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటనపై మరియం స్పందిస్తూ చిన్న పిల్లలు, మహిళలు చనిపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్-ఆఫ్ఘన్ సాన్నిహిత్యంపై పాక్ అసహనం: భారత్‌తో ఆఫ్ఘనిస్థాన్ సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలనుకున్న ప్రతిసారీ పాకిస్థాన్ ఇలాగే దాడులు చేస్తోందని మరియం ఆరోపించారు. భారతీయులు, ఆఫ్ఘన్ల మధ్య శాంతి నెలకొనడం పాక్‌కు అసహనంగా మారిందని ఆమె మండిపడ్డారు.
ఉగ్రవాదం పేరుతో సామాన్యులపై దాడులు: ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేస్తున్నామని చెబుతూ, పాకిస్థాన్ సామాన్యులపై బాంబులు కురిపిస్తోందని మరియం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఒక్క ఉగ్రవాది కూడా చనిపోయినట్లు పాక్ చూపించలేకపోయిందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
అమానుష దాడులపై ప్రపంచవ్యాప్త ఆగ్రహం: పాక్ దాడుల్లో మరణించిన ఆఫ్ఘన్ పౌరులు, చిన్నారుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని మరియం గుర్తు చేశారు. ఈ దృశ్యాలు పాక్ అమానుషత్వానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు.