No Diwali Fireworks In Three Villages: పంజాబ్‌ లోని ఈ గ్రామాల్లో కొన్ని దశాబ్దాల నుండి దీపావళి జరుపుకోవడం లేదు.. ఎందుకో తెలుసా?

No Diwali Fireworks In Three Villages: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నప్పటికీ, పంజాబ్‌లోని మూడు గ్రామాలు మాత్రం దశాబ్దాలుగా ఈ ఉత్సవాలకు దూరంగా ఉంటున్నాయి. కారణం, ఆ గ్రామాలు ఆర్మీ కంటోన్మెంట్ మరియు ఆయిల్ డిపోలకు సమీపంలో ఉండటమే. పంజాబ్‌లో బఠిండా కంటోన్మెంట్ 1976లో స్థాపించబడిన తర్వాత, ఫస్ మండీ, భాగు, గులాబ్ఢ్ గ్రామాల్లో బాణసంచా కాల్చడంపై స్థానిక అధికార యంత్రాంగం కఠిన ఆంక్షలు విధించింది. 

No Diwali Fireworks In Three Villages
No Diwali Fireworks In Three Villages

ప్రతి సంవత్సరం దీపావళి ముందు ఈ గ్రామాల్లో బాణసంచా కాల్చరాదని, పంట వ్యర్థాలను దహనం చేయకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఎవరైనా ఆంక్షలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా తెలియజేస్తారు. 

అంతేకాదు, పంటపొలాల్లో చిన్న మంట పెట్టినా సైనికుల నుంచి వెంటనే హెచ్చరికలు అందుతాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీపావళి సమయం రాగానే తమ పిల్లలను అమ్మమ్మ ఇళ్లకు పంపించడం అలవాటైందని వారు వెల్లడించారు



Post a Comment (0)
Previous Post Next Post